సాయంత్రం పూట స్నేహితులతో మంతనాలు పెడుతూ అలా ఓ బాటిల్ రెడ్ వైన్ అంతా కలిసి ఖాలీ చేస్తే ఆ కిక్కే వేరు కదా.ఎంత కిక్కు ఇచ్చినా లిమిటెడ్ గానే తాగిలి లేండి.
లిమిటెడ్ గా తాగితే ఆల్కహాల్ మంచిదే అని మనకు తెలిసిన విషయమే.కాని రెడ్ వైన్ తో చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలుసా ?
* రెడ్ వైన్ లో నేచురల్ AHA’s ఉండటం వలన దీంట్లో యాంటిసెప్టిక్, యాంటి ఇంఫ్లేమెంటరీ ప్రాపర్టీస్ ఉంటాయి.కాబట్టి రెడ్ వైన్ ని చర్మం మీద రాయడం వలన మొటిమల ఇబ్బంది తగ్గించవచ్చు అని పరిశోధనలు చెబుతున్నాయి.
* అమినో ఆసిడ్స్ కూడా రెడ్ వైన్ లో ఎక్కువే.
కాబట్టి ఇది ఆయిల్ స్కిన్ ఉన్నవారికి పనికొస్తుంది.యాంటిఆక్సిడెంట్స్ ఉండటం వలన ఇది మీ చర్మాన్ని సంరక్షిస్తుంది.
* రెడ్ వైన్ వలన చర్మం రంగు తేలుతుందని ఇప్పటికే విని ఉంటారు.అది నిజమే.
రెడ్ వైన్ స్కిన్ కంప్లెక్షన్ ని పెంచుతుంది.
* యాంటి ఏజింగ్ ప్రాపర్టీస్ రెడ్ వైన్ లో ఉంటాయని చాలా రిపోర్ట్స్ ఉన్నాయి.
వాటిని బట్టి చూస్తే, రెడ్ వైన్ వయసు కూడా పెద్దగా కనబడకుండా ఉంచుతుంది చర్మాన్ని.
* రెడ్ వైన్ లో పోలిఫెలన్స్ ఉండటం వలన ఇది సెల్ ఆక్సిడేషన్ ని అడ్డుకుంటుంది.
క్లియర్ స్కిన్ పొందాలనుకునేవారు రెడ్ వైన్ ఉపయోగించటం మంచి ఐడియా.