ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష నేత జగన్ చేయాల్సిన పోరాటాలన్నీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసి క్రెడిట్ కొట్టేస్తున్నారు.వరుసగా అటు ప్రజా సమస్యలపై.
ఇటు ప్రభుత్వ వైఫల్యాలపై సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి దూసుకెళిపోతున్నాడు జనసేనాని.దీంతో ప్రతిపక్ష నేత జగన్ దూకుడు పెంచాలని భావిస్తున్నాడు.
ప్రజా సమస్యలపై ఇక పవన్‌నే కాపీ కొట్టాలని డిసైడ్ అయిపోయాడు.దీంతోనైనా ఇమేజ్‌ను కొట్టేయాలని చూస్తున్నాడు.
ఏపీ రాజకీయాల్లో పవన్ తారాజువ్వలా దూసుకుపోతున్నాడు.అటు సినిమాలు ఇటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ జనసేనను ప్రజల్లోకి తీసుకెళుతున్నాడు.
నిజానికి ఇటీవల పరిణామాలను గమనిస్తే.వైకాపా అధినేత జగన్ కన్నా.
జనసేనాని పవనే దూకుడుగా ఉంటున్నాడు.మొన్నటికి మొన్న శ్రీకాకుళం కిడ్నీల బాధితుల విషయం మీడియాలో వచ్చాక ఫస్ట్ స్పందించింది పవన్.
ఆ తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించాడు జగన్.ఇప్పుడు ప్రత్యేకహోదా విషయంలోనూ పవన్‌నే కాపీ కొడుతున్నాడు జగన్.
నిజానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న నేత.హోదా కోసం రాష్ట్రం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకురావాల్సిన జగన్ నిన్న మొన్నటి వరకు సైలెంట్ అయిపోయారు.
తమిళనాడు జల్లి కట్టు దెబ్బతో ఫస్ట్ రియాక్ట్ అయిన ఏపీ యువత.తంబిలకున్న పౌరుషం తెలుగు వాళ్లకి లేదా.
అని సోషల్ మీడియాలో కామెంట్లతో కుమ్మేశారు.దీంతో స్పాట్‌లో స్పందించిన పవన్.
యువతకు అండగా నిలబడ్డారు.తాను కూడా అండగా నిలబడతానని, కేంద్రం మెడలు వంచైనా సాధిద్దామని ట్వీట్ చేశాడు.
పవన్ లైన్‌లోకి రావడంతో జగన్ కూడా హడావుడిగా స్పందించేశాడు.హోదా కోసం పోరాడే యువతకు అన్ని విధాలా తాను సహకరిస్తానని జగన్ ట్వీట్ చేశాడు.
అయితే పవన్‌ను జగన్ ఫాలో అవడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద కామెడీగా మారింది.వాస్తవానికి ఇలాంటి ప్రధాన విషయాలపై ముందుండి యువతను నడిపించాల్సిన జగన్ ఇలా మారిపోయాడేంటాని అందరూ చర్చించు కుంటున్నారు.
వాస్తవానికి ఎన్నికలు జరగడానికి మరో రెండేళ్ల సమయమే ఉంది.ఈ క్రమంలో నూతన ఆలోచనలు, ఉద్యమాలతో యువతను ఆకట్టుకోవాల్సిన జగన్.
ఇలా .కాపీ కొట్టే కార్యక్రమాలకు తెరదీయడం ఏంటని విశ్లేషకులు అంటున్నారు.