ప్రపంచంలో నలువైపుల నుంచి ఎటాక్ చేస్తున్న కరోనా వైరస్ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు.ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే ఎనిమిది లక్షల మందికి పైగా ప్రాణాలు విడిచారు.
ఇంకెందరికో కరోనా సోకి.నానా ఇబ్బందులు పడుతున్నారు.
అయితే తాజాగా కరోనా వైరస్‌ను అడ్డుపెట్టుకుని.భర్తనే చంపిందో భార్య.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.బెల్లంపల్లి మండలంలోని పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన సింగరేణి కాలరీస్ గని కార్మికుడు ముత్తె శంకర్ కి భార్య(విజయ), ఒక కూతురు(స్వాతి), ఒక కొడుకు(కారుణ్య) ఉన్నారు.
అయితే శంకర్ కి, అతడి భార్య విజయకు పడకపోవడంతో.కుటుంబం నుంచి విడిపోయాడు.ఈ క్రమంలోనే శంకర్ మంచిర్యాలలో ఒక్కడే నివాసం ఉంటూ.శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్‌కె–7 గనిలో టింబర్‌మెన్‌గా విధులు నిర్వహించేవాడు.
అయితే ఒకరోజు శంకర్ కి అతడి భార్య ఫోన్ చేసి.మన కుమార్తెకు కరోనా సోకింది, పరిస్థితి చాలా విషమంగా ఉంది.మీరు త్వరగా ఇంటికి రావాలంటూ కన్నీరు కార్చింది.భార్య మాటలు నమ్మిన శంకర్ ఇంటికి వెళ్లాడు.
అయితే అదే రోజు రాత్రి విజయ కొడుకు, కూతురు సాయంతో భర్తను చంపేసి.ఆత్మహత్యగా చిత్రికరించింది.
ఇక స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపాట్టారు.
ఈ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.ట్విస్ట్ ఏంటంటే.సింగరేణి కాలరీస్ గని కార్మికుడుగా చేస్తున్న శంకర్ మరో రెండు సంవత్సరాల్లో ఉద్యోగ విరమణ పొందనున్నాడు.ఆ ఉద్యోగం తన కుమారుడు కారుణ్యకు రావాలని భావించిన విజయ.
ఏకంగా భర్తనే చంపాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలోనే కుమార్తెకు కరోనా సోకిందని భర్తని ఇంటికి పిలిచి.
ప్లాన్ ప్రకారమే హతమార్చింది.అయితే శంకర్ మృతిని అనుమానించిన పోలీసులు.
తమదైన శైలిలో విచారణ జరపగా విజయ బండారం బయటపడింది.ప్రస్తుతం నింధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.