నితీష్‌ను ఎందుకు ఆపారు?

బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ను భూకంప బాధిత నేపాల్‌కు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం ఆపేసింది.ఎందుకు? దానికి కారణం చెప్పాలి? అని డిమాండ్‌ చేశారు జేడీయూ నేతలు పార్లమెంటులో.నేపాల్‌ సరిహద్దు బిహార్‌ రాష్ర్టానికి దగ్గర్లో ఉంటుంది.హెలిక్యాప్టర్లో అయితే అరగంటలో నేపాల్‌కు చేరుకోవచ్చు.కాని మోదీ ప్రభుత్వం నితీష్‌ను ఆ దేశానికి వెళ్లనివ్వలేదు.ఆయన నేపాల్‌కు వెళ్లడానికి ప్ర భుత్వం మొదట్లో అనుమతి ఇచ్చింది.

 ‘why Wasn’t Nitish Kumar Allowed To Visit Nepal?-TeluguStop.com

తీరా బయలుదేరదామనుకునే సమయానికి ఆయన ప్రయాణాన్ని వాయిదా వేసింది.కారణం చెప్పలేదు.

దీనిపై లోక్‌సభలో శరద్‌ యాదవ్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు.సీఎం నితీష్‌ కుమార్‌ బిహార్‌కు దగ్గరగా ఉన్న జనక్‌పూర్‌కు వెళ్లి అక్కడి పరిస్థితిని చూసి భూకంప బాధితులను పరామర్శించాలని అనుకున్నారు.

అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాత ప్రభుత్వం ఆపేసింది.ఎటువంటి కారణం చెప్పకుండా ఒక ముఖ్యమంత్రి పర్యటనను ఆపడమేమిటి? ఇది ఆయన్ని అగౌరవపరిచినట్లే కదా.అందులోనూ నేపాల్‌ వేల మైళ్ల దూరంలోనూ లేదు.అరగంట ప్ర యాణ దూరంలో్ ఉంది.

ఇది భాజపా రాజకీయం తప్ప మరోటి కాదని జేడీయూ నేతలు మండిపడుతున్నారు.రెండు పార్టీలకు పడదు కదా.నేపాల్‌లో భూకంపం రాగానే మోదీ ప్రభుత్వం స్పందించిన తీరును నితీష్‌ ప్రశంసించారు కూడా.అయినప్పటికీ ఆయన్ని ఎందుకు ఆపారో తెలియదు.

కేంద్రం దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube