కారు కొన్నాక కస్టమర్లు పెద్ద 'కీ'తో ఫొటోలు ఎందుకు దిగుతారంటే?

కారు కొనాలనేది ఇక్కడ ప్రతీ ఒక్క మధ్యతరగతివాడి డ్రీమ్‌.అందుకే తమ జీవితంలో తొలిసారిగా కారు( Car ) కొన్న సందర్భాన్ని ఓ పండుగలా జరుపుకొంటారు సదరు వ్యక్తులు.

 Why Customers Took Photo With Big Key While Buying A New Car Details, Latest New-TeluguStop.com

సాధారణంగా మీరు చూసేవుంటారు.కొత్త కారు కొనుగోలు చేసినప్పుడు యజమానికి.

షోరూమ్ ఓనర్లు పెద్ద తాళం చెవి( Large Key ) ఇచ్చి ఫోటో దిగడం వంటివి చేస్తుంటారు.ఇక ఇలా కారు ఓనర్‌కు పెద్ద కీ ఎందుకు ఇస్తారని మీరు గమనించారా? ఇక కారు డెలివరీ అనంతరం చాలా మంది సోషల్ మీడియాలో ఈ సంతోషకర సందర్భాన్ని పంచుకుంటారు కూడా.

Telugu Key, Latest, Trick, Car Big Key, Car Customers, Automobile, Vehicle Key,

ఇక ఫొటో దిగిన అనంతరం సదరు పెద్ద కీని మాత్రం ఓనర్‌కి ఇవ్వరు.కేవలం ఫోటో కోసం మాత్రమే ఆ కీని వారికిస్తారు.అయితే ఇలా చేయడానికి కొన్ని కారణాలున్నాయి.ఒరిజినల్‌ చిన్న తాళం చెవితో( Original Key ) ఫొటో దిగితే అది ఫొటోలో కనిపించదు.కేవలం పోజుల కోసమే ఇలా దిగుతున్నారని అనుకునే ఛాన్స్‌ కూడా ఉంటుంది.దీని వెనుక అతిపెద్ద మార్కెటింగ్ ట్రిక్( Marketing Trick ) వుందండోయ్.

ఇలా పెద్ద తాళం చెవితో ఫొటో దిగడం ద్వారా కార్‌ మేకర్‌ కంపెనీకి కూడా మంచి పేరొస్తుంది.కస్టమర్లకు కూడా ఇదో సంతృప్తి.

Telugu Key, Latest, Trick, Car Big Key, Car Customers, Automobile, Vehicle Key,

కొత్త కారు( New Car ) కొనుగోలు చేసిన కస్టమర్లకు పెద్ద తాళం ఇచ్చి.వారిని కారు ముందు నిలబెట్టి ఫోటోలు దిగడం ద్వారా తమ వినియోగదారులకు వారు ఆత్మసంతృప్తిని ఇస్తారు.అంటే వారు కొత్త కారు కొనుగోలు చేయాలనే నిర్ణయం సరైనదే అని భావనను కలిగించే ప్రయత్నం చేస్తారన్నమాట.ఇక కారును కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు తమ సంపాదనలో భారీ మొత్తాన్ని అందులో పెట్టుబడి పెడతారు.

అందుకే కొత్త కారు కొనుగోలు వారి జీవితంలో మరిచిపోలేనిది.అందుకే ఆ సందర్భాన్ని ఫొటో తీసి.

వారికి మరపురాని జ్ఞాపకాన్ని ఇస్తారు వారు.దాంతో ఆ ఫొటో వారికి స్వీట్‌ మెమొరీగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube