Jaya Prada: అయ్యో పాపం జయప్రద కు అవకాశాలు లేకుండా చేశాడా ఆ దర్శకుడు

భారతదేశ సినీ చరిత్రలో అగ్ర దర్శకులలో ఒకరు కైలాసం బాలచందర్.బాలచందర్ ( Balachander )1930 వ సంవత్సరంలో తంజావూరు దగ్గర నన్నిలం అనే గ్రామంలో జన్మించారు.50 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆయన వంద చిత్రాలకు పైగా పనిచేసారు.పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, నర్గిస్ దుత్త అవార్డు, అనేక జాతీయ పురస్కారాలు, ఇలా ఆయన అందుకొని గౌరవం లేదు.

 Who Made Jayaprada Career Collapse-TeluguStop.com

భారతదేశ సినిమా రంగంలో సూపర్ స్టార్లు గా ఎదిగిన రజినీకాంత్, కమలహాసన్ వంటివారు ఆయనని తమ గురువుగా భావిస్తారు.ఐతే ఇలాంటి మహనీయుడి సినిమాలో నటించిన తరువాత జయప్రదకు చాలాకాలం అవకాశాలు రాలేదట.కారణం ఏమిటంటే…

Telugu Anthuleni Katha, Jaya Prada, Jayaprada, Kamal Haasan, Rajinikanth, Rudrav

బాలచందర్ గారికి ఎక్కువగా ప్రయోగాలు చేస్తారనే పేరు.సగటు మధ్యతరగతి జీవితాలను దృష్టిలో పెట్టుకుని ఆయన తన సినిమాలలో చేసిన ప్రయోగాలు ఇన్ని అన్ని కాదు.ఆయన తెరకెక్కించిన మరోచరిత్ర, సింధు భైరవి వంటి చిత్రాలు ఇంకా మన మనసులలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

యాక్షన్ సినిమాలు, కుటుంబకథా చిత్రాలు చేసుకునే చిరంజీవి తో రుద్రవీణ( Rudraveena ) లాంటి ఒక సోసియో కల్చరల్ సినిమాను తెరకెక్కించాలనే ఆలోచన ఆయన సొంతం.అలాంటి కథలలో ఒకటి “అంతులేని కథ”.

Telugu Anthuleni Katha, Jaya Prada, Jayaprada, Kamal Haasan, Rajinikanth, Rudrav

అంతులేని కథ చిత్రానికి( Anthuleni Katha ) బాలచందర్ గారికి హీరోయిన్ క్యారక్టరుకి యాక్టర్ కావాలి.ఈ సినిమాలో హీరోయిన్ అనేక లక్షణాలు ఒకే సారి చూపించగలగాలి.కోపం, లావణ్యం, పొగరు తో పాటు ఆలోచనాపరురాలైన వ్యక్తిత్వం కూడా ఉండాలి.

ఈ పాత్రకు జయప్రదను సజెస్ట్ చేసారట రజినీకాంత్.ఈ చిత్రంలో రజినీకాంత్( Rajinikanth ) ది జయప్రధ అన్నయ్య పాత్ర.

ఏ బాధ్యతలు లేకుండా ఉండే తాగుబోతు ఇంటిపెద్ద పాత్ర.ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

కానీ జయప్రధ కు మాత్రం ఆరు నెలలపాటు ఏ అవకాశాలు రాలేదట.దానికి కారణం ఈ చిత్రంలో ఆమె క్యారక్టర్.

ఈ చిత్రంలో ఆమె గంభీరంగా కనిపించేసరికి ఆమెను సౌమ్యమైన పాత్రలలో పాటలు, డాన్సులతో చూపిస్తే జనాలు యాక్సప్ట్ చేస్తారో లేదో అనే సందేహంతో ఎవరు ఆమెకు అవకాశాలు ఇవ్వలేదట.ఈ విషయాన్నీ జయప్రధ అనేక ఇంటర్వ్యూలలో బయటపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube