మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది.ఒక పాము ఏడాదిన్నర వయసున్న పాపకు తల్లిని దూరం చేసింది.
హృదయాన్ని కరిగించేలా ఉన్న ఈ ఘటన తాలూకూ విషయం తెలుసుకుంటే.
మహారాష్ట్రలోని, చంద్రాపూర్ మండలం, సోనాపూర్ నుంచి కొందరు కూలీలు ఉపాది నిమిత్తం కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని ఊటుకూరు వచ్చారు.
వీరంతా గ్రామంలోని బీసీ కాలనీ పాఠశాల దగ్గర గుడారంలో ఉంటు మిరప కోతలకు వెళుతున్నారట.ఈ క్రమంలో ఆ గుడారంలో మంగళవారం రాత్రి ఆదమరచి నిద్రపోతున్న వేళ తన బిడ్ద ఏడ్వడంతో మెలకువ వచ్చిన ఆ తల్లి తన పసిది ఆకలికి ఏడుస్తుందని భావించి బిడ్డను పొదివి పట్టుకుని తన స్తనం నోటికి అందించిందట.
అంతలో ఎక్కడ నుంచి వచ్చిందో గానీ ఓ పాము తల్లి శ్రుతి రొమ్ముపై కాటేసిందట.దీంతో తన బిడ్దను కూడా ఆ పాము పొట్టన పెట్టుకుంటుందని భావించిన ఆ తల్లి తన గురించి భయపడకుండా ఆ పామును చేతితో పట్టుకుని ఓ వైపు విసిరేసిందట.
ఆ చీకట్లో రూపేష్ ప్రకాష్ చప్డే అనే యువకుడిపై పడి ఆ పాము అతడినీ కూడా కాటేసిందట.ఇక ఆ తల్లి అరపులకు మెలకువ వచ్చిన మిగతా వారు వెంటనే వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శ్రుతి మరణించిందట.
కాగా ఆ యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం.