ఓ తల్లి తన బిడ్డకు పాలిస్తుండగా పాపం ఘోరం జరిగిపోయింది.. ?
TeluguStop.com
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది.ఒక పాము ఏడాదిన్నర వయసున్న పాపకు తల్లిని దూరం చేసింది.
హృదయాన్ని కరిగించేలా ఉన్న ఈ ఘటన తాలూకూ విషయం తెలుసుకుంటే.మహారాష్ట్రలోని, చంద్రాపూర్ మండలం, సోనాపూర్ నుంచి కొందరు కూలీలు ఉపాది నిమిత్తం కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని ఊటుకూరు వచ్చారు.
వీరంతా గ్రామంలోని బీసీ కాలనీ పాఠశాల దగ్గర గుడారంలో ఉంటు మిరప కోతలకు వెళుతున్నారట.
ఈ క్రమంలో ఆ గుడారంలో మంగళవారం రాత్రి ఆదమరచి నిద్రపోతున్న వేళ తన బిడ్ద ఏడ్వడంతో మెలకువ వచ్చిన ఆ తల్లి తన పసిది ఆకలికి ఏడుస్తుందని భావించి బిడ్డను పొదివి పట్టుకుని తన స్తనం నోటికి అందించిందట.
అంతలో ఎక్కడ నుంచి వచ్చిందో గానీ ఓ పాము తల్లి శ్రుతి రొమ్ముపై కాటేసిందట.
దీంతో తన బిడ్దను కూడా ఆ పాము పొట్టన పెట్టుకుంటుందని భావించిన ఆ తల్లి తన గురించి భయపడకుండా ఆ పామును చేతితో పట్టుకుని ఓ వైపు విసిరేసిందట.
ఆ చీకట్లో రూపేష్ ప్రకాష్ చప్డే అనే యువకుడిపై పడి ఆ పాము అతడినీ కూడా కాటేసిందట.
ఇక ఆ తల్లి అరపులకు మెలకువ వచ్చిన మిగతా వారు వెంటనే వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శ్రుతి మరణించిందట.
కాగా ఆ యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం.
ప్లీజ్ సార్ అంటూ నాగార్జునను రిక్వెస్ట్ చేస్తున్న జబర్దస్త్ యాంకర్… ఏమైందంటే?