Prabhas Manchu Vishnu : మంచు విష్ణు ప్రభాస్ కి మధ్య అంత మంచి బాండింగ్ పెరగడానికి కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వాళ్ల పెదనాన్న కృష్ణంరాజు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ఎదగడం అనేది మామూలు విషయం కాదు.

 What Is The Reason For Such Good Bonding Between Manchu Vishnu Prabhas-TeluguStop.com

తనతో పాటు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోలందరూ వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నా కూడా తను మాత్రం ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఇప్పటికే పాన్ ఇండియాలో( Pan India ) వరుస సినిమాలను రిలీజ్ చేస్తూ ఇండియా లోనే నెంబర్ వన్ హీరో గా పేరు సంపాదించుకున్నాడు.</br

ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ కి కూడా మంచి క్రేజ్ అయితే ఉంది.

 What Is The Reason For Such Good Bonding Between Manchu Vishnu Prabhas-Prabhas-TeluguStop.com

అయితే వాళ్ళు ఎప్పటికప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం వల్ల ప్రేక్షకుల్లో కొంతవరకు క్రేజ్ ని తగ్గించుకున్నారు.దీనివల్ల వాళ్లకి తెలియకుండానే వాళ్ళకి చాలా మైనస్ అయితే జరుగుతుంది.

ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి మంచు ఫ్యామిలీతో( Manchu Family ) ప్రభాస్ కి మంచి రిలేషన్ ఉంది.ఇక ఆ అనుబంధంతోనే బుజ్జిగాడు సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో మోహన్ బాబు నటించాడు.ఇక మంచి విష్ణు( Manchu Vishnu ) హీరో గా వచ్చిన దేనికైనా రెడీ సినిమా కోసం ప్రభాస్ ఒక చిన్న సీన్ లో తన వాయిస్ ని కూడా అందించాడు.ఇక ఇప్పుడు అదే చనువుతో మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమాలో( Kannappa Movie ) శివుడి పాత్రలో నటిస్తున్నాడు.

అయితే మోహన్ బాబు కృష్ణంరాజు మంచి సన్నిహితులుగా ఉండేవారు అందువల్ల మంచు విష్ణు ప్రభాస్ కూడా మంచి ఫ్రెండ్స్ గా చిన్నప్పటి నుంచి కొనసాగుతూ వస్తున్నారు.అందువల్లే వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ఏదైనా చేసుకునేంతలా మంచి ఫ్రెండ్స్ గా ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.దానివల్లే ప్రభాస్ మంచు విష్ణు సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube