అమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా ఏంటో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో సరికొత్త ప్రయోగాలు చేశాడు సూపర్ స్టార్ కృష్ణ‌.ఏ హీరోకు సాధ్యం కాని సాహసాలు చేశాడు ఆయన.

 What Is The First Movie Of Telugu Movie Which Shoots In America, America First S-TeluguStop.com

పలు జానర్ సినిమాలతో పాటు ఆనేక ఫార్మాట్లకు ఆయన సినిమాలే బేస్ మార్క్ గా నిలిచాయి.అంతేకాదు.

అప్పటి వరకు భారతదేశానికి మాత్రమే పరిమితం అయిన తెలుగు సినిమా షూటింగ్ ను తొలిసారి అమెరికాకు తీసుకెళ్లిన నటుడు ఆయన.అమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా కృష్ణ‌దే కావడం విశేషం.ఇంతకీ ఆ సినిమా విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1980లో కృష్ణ‌ హీరోగా హ‌రేకృష్ణ హ‌లోరాధ తీస్తున్నారు.ఆ సినిమా ఒకపాట, కొన్ని సీన్లు మినహా 90 శాతం షూటింగ్ పూర్తయ్యింది. శ్రీ ప్రియ నటీమణిగా చేసింది.ఈ సినిమాకు శ్రీధర్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలోని మిగిలిన బాగాలను అమెరికాలో చిత్రీకరించడానికి ప్రత్యేకంగా కథలను మార్చారు.

తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను చిత్రీకరించారు.లాస్ ఏంజెల్స్‌, శాంతామోనికా బీచ్‌, శాండియాగో బీచ్‌, లాస్ వేగాస్‌, ఫీనిక్స్ సహా పలు ప్రాంతాల్లో సీన్లు, పాటలు షూట్ చేశారు.

క్లైమాక్స్ గ్రాండ్ కాన్య‌న్‌లో చిత్రీకరించారు.

Telugu America, Sridhar, Krishna, Sri Priya, Telugu-Telugu Stop Exclusive Top St

అనంతరం గుర్రాల ఆట చిత్రీకరణ కోసం ఫీనిక్స్ లో షూటింగ్ కొనసాగించారు.ఆ ఆటను చూస్తూ, ఎవరూ లొంగదీయలేని గుర్రాన్ని హీరో లొంగదీసే సీన్లకు అక్కడ చిత్రీకరించారు.అద్భుతంగా వచ్చిన ఈ సీన్లన్నీ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అటు డైరెక్ట‌ర్ శ్రీ‌ధ‌ర్‌.ఆదుర్తి సుబ్బారావు తేనె మ‌న‌సులు సినిమాతో కృష్ణ‌ను హీరోగా ప‌రిచ‌యం చేశాడు.

కానీ అంతకంటే ముందే ఓ త‌మిళ సినిమాతో కృష్ణ‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాడు.కానీ అది సాధ్యం కాలేదు.

ఆ సినిమా తర్వాత 15 సంవత్సరాల తర్వాత హ‌రేకృష్ణ హ‌లోరాధ సినిమాతో కృష్ణ‌ను హీరోగా పరిచయం చేశాడు.మొత్తంగా ఈ సినిమాతో ఆయన సక్సెస్ కొట్టాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube