టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు.చంద్రబాబు కాలజ్ఞానం చెబుతున్నారన్న ఆయన 2020 విజన్ తో చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు.
ఇప్పుడు విజన్ 2047 అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు.ఒక్క ప్రాజెక్టునైనా చంద్రబాబు మొదలు పెట్టి పూర్తి చేశారా అని ప్రశ్నించారు.
చిత్తూరు జిల్లాకు నీళ్లు ఇచ్చారా అని నిలదీసిన ఆయన కనీసం కుప్పానికైనా ఇచ్చారా అని అడిగారు.చంద్రబాబు తెచ్చిన పథకాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు.
చంద్రబాబు పథకాలు అంటే పబ్లిసిటీ మాత్రమేనన్న పేర్ని నాని విద్యపై చంద్రబాబు విజన్ ఎడ్యుకేషన్ ఎక్కడుందో చెప్పాలన్నారు.ఏనాడైనా ఒక్క ప్రభుత్వ పాఠశాలను అయినా బాగు చేశారా అన్న ఆయన వేల స్కూళ్లు, ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లను మూతవేశారని మండిపడ్డారు.