తన యువగళం ( yuvagalam ) పాదయాత్రతో ఇప్పటికే 60 శాతానికి పైగా పాదయాత్ర లక్ష్యాన్ని పూర్తి చేసుకున్న టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh )అనూహ్య పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు( Chandrababu ) అరెస్ట్ అవడంతో ఆ పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు.ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల మధ్య ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ కు మధ్య షటిల్ చేసిన లోకేష్ చంద్రబాబు కు మద్యంతర రిలీఫ్ దొరకడంతో ఇక తిరిగి ప్రజల మధ్యకు వస్తారని ఆగిపోయిన కార్యక్రమాలను మొదలు పెడతారని చాలామంది భావించారు, అయితే బాబు విడుదలై ఇప్పటికే రెండు వారాలు గడుస్తున్నా లోకేష్ పర్యటన గురించి ఇంతవరకూ పార్టీ నుండి స్పష్టత రాలేదు పైగా పార్టీ అంతర్గత సమావేశాలు కూడా ఇంతవరకు ఏమీ జరగలేదు.

సమన్వయ భేటీలకు ప్రత్యేకమైన కమిటీలను నియమించడంతో అవి వాటి పని చేసుకుంటున్నయి.మరి ఎన్నికలకు ఇంకా తక్కువ సమయం ఉండటంతో ఇలాంటి కీలకమైన సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారన్నది ప్రశ్నగా మారింది.అయితే అధికార పార్టీ మరిన్ని ఇబ్బందులు పెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుందన్న అంచనా తోనే వాటికి విరుగుడు మంత్రాలు తయారు చేసుకునే పనుల్లో లోకేష్ బిజీగా ఉన్నారని, చంద్రబాబుకు ఒకసారి సాధారణ బెయిల్ లభిస్తే పరిస్థితి సర్దుకుంటుంది అని ఆ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెడదాం అని ఆలోచనలో లోకేష్ ఉన్నారని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.

ఏది ఏమైనా ఒకవైపు అధికారపక్షం రకరకాల కార్యక్రమాలతో ప్రతిరోజూ ప్రజల ఇంటి గడప తొక్కుతూ వారికి తాము చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ మైలేజ్ ను పెంచుకుంటుంటే దానికి రెండింతలు కష్టపడాల్సిన ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇంకా మీన మేషాలు లేక్కిస్తు కాలం వృదా చేయడం ఆ రెండు పార్టీల బవిష్యత్తు కు అంత మంచిది కాదని రాజకీయ పరిశీలకులు వాఖ్యనిస్తున్నారు .మరి లోకేష్ ఇప్పటికైనా వేగం పెంచాలని టిడిపి శ్రేణులు కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది .