నువ్వుల పంటను ఆశించే బీహారి గొంగళి పురుగులను నివారించే పద్ధతులు..!

నువ్వుల పంట( Sesame crop )ను తక్కువ వనరులతో సాగు చేసి అధిక నికర లాభం అర్జించవచ్చు.ఈ పంటను రెండవ పంటగా జనవరి లేదా ఫిబ్రవరి మాసాల్లో విత్తుకొని సాగు చేసుకోవచ్చు.

 Ways To Prevent Bihari Caterpillars That Hope For The Sesame Crop , Sesame Harv-TeluguStop.com

ఈ పంటను వర్షాధారంగా ఖరీఫ్ లేదా రబీలో వర్షాధారంగా పండించవచ్చు.రెండవ పంటగా వేసవికాలంలో ( Summer )సాగు చేయవచ్చు.

తెగులు నిరోధక విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.వేసవిలో ఆరుతడిగా సాగు చేస్తే చీడపీడల బాధ తక్కువగా ఉంటుంది.

నీరు నిల్వ ఉందని నల్ల రేగడి నేలలు, ఎర్ర గరప నేలలు ఈ పంట సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి.నీరు నిల్వ ఉండే ఆమ్లా, క్షార గుణాలు కలిగి ఉన్న నేలలు ఈ సాగుకు పనికిరావు.వేసవికాలంలో నేలను రెండు లేదా మూడుసార్లు మెత్తగా దున్నుకొని, రెండుసార్లు గుంటక తోలి నేలను చదువు చేయాలి.ఒక ఎకరం పొలానికి 2.5 కిలోల విత్తనాలు అవసరం.ఈ విత్తనాలను మూడు గ్రాముల థైరంతో విత్తన శుద్ధి ( Seed treatment )చేసుకోవాలి.

ఆ తర్వాత విత్తనానికి మూడింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి.

ఈ పంటకు ఆశించి తీవ్ర నష్టం కలిగించే చీడపీడలలో బీహారి గొంగళి పురుగులు( Bihari caterpillars ) కీలక పాత్ర పోషిస్తాయి.ఈ పురుగులను తొలిదశలోనే గుర్తించి నివారించాలి.పురుగులు గుంపులుగా ఆకులలోని పత్ర హరితాన్ని గోకితిని ఆకును జల్లెడాకుల చేస్తాయి.

ఆ తరువాత మొగ్గలకు, పువ్వులకు, కాయలకు రంద్రాలు చేస్తూ విత్తనాలను తినేస్తాయి.ఈ పురుగులు ఆశించిన చెట్లను పీకి నాశనం చేయాలి.

ఎందుకంటే ఈ పురుగులు ఆశించిన మొక్కలపై పురుగుల గుడ్లు ఉండే అవకాశం ఉంది.ఇక ఒక లీటరు నీటిలో 2మి.లీ ఎండో సల్ఫాన్ ను కలిపి పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube