ఏపీలో వాలంటీర్ల( Volunteers in AP ) చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది. ప్రతి 50 ఇళ్ల కు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి , ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను జగన్ ఏర్పాటు చేసి, ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలతో పాటు వృద్ధులకు , వితంతువులకు , వికలాంగులకు పెన్షన్లు వారి ఇళ్ల వద్దకే అందించే ఏర్పాటు చేశారు.
ఈ వ్యవస్థ దేశవ్యాప్తంగా జగన్ కు ప్రశంసలు అందేలా చేశాయి.మొదట్లో టీడీపి , జనసేన( TDP, Jana Sena ) పార్టీలు ఈ వాలంటరీ వ్యవస్థపై అనేక విమర్శలు చేశాయి.
అయితే ఈ వ్యవస్థ జనాలకు బాగా కనెక్ట్ కావడం తో , టీడీపీ కూటమి పార్టీలు సైతం వాలంటీర్ వ్యవస్థను తాము అధికారంలోకి వచ్చినా కొనసాగిస్తామని , అంతేకాదు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ఐదువేల గౌరవ వేతనాన్ని డబుల్ చేసి పదివేలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
ఇదిలా ఉంటే తెలంగాణలోనూ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సిద్ధమవుతున్నారు.పార్లమెంట్ ఎన్నికల తరువాత దాదాపు 36వేల మంది వాలంటీర్లను నియమించేందుకు రేవంత్ కసరత్తు చేస్తున్నారు.దీనికి సంబంధించి పార్టీ కీలక నేతలతో చర్చిస్తున్నట్టు సమాచారం.
వాలంటీర్ల నియామకం విషయంలో ఏపీ తరహాలో కాకుండా కొంత మార్పు చేర్పులు చేపట్టాలని రేవంత్ భావిస్తున్నారట.కాంగ్రెస్( Congress ) ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలను ప్రచారం చేయడమే కాకుండా లబ్ధిదారులకు సామాజిక భద్రత పింఛన్లు, సంక్షేమ పథకాలను పంపిణీ చేయడం వంటి బాధ్యతలను అప్పగించబోతున్నారట.
ఈ వాలంటీర్లకు గౌరవ వేతనం ప్రభుత్వమే చెల్లించనుంది.రాబోయే లోక్ సభ ఎన్నికల ( Lok Sabha elections )తంతు ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో దీనిపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ప్రతిభావంతులైన పార్టీ కార్యకర్తలను గుర్తించి, వారికి వాలంటీర్ ఉద్యోగాన్ని అప్పగించడం ద్వారా ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను అట్టడుగు స్థాయికి సులభంగా తీసుకువెళ్లవచ్చనే ఆలోచనతో రేవంత్ ఉన్నారట.దీనికి సంబంధించి త్వరలోనే కార్యాచరణను రూపొందించే ప్లాన్ లో రేవంత్ ఉన్నారు.