ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్నూలు జిల్లాలో టీడీపీకి ( TDP )భారీ షాక్ తగలనుందని తెలుస్తోంది.జిల్లాలోని మూడు, నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీకి గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
టికెట్ ఆశించిన భంగపడిన నలుగురు నేతలు పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఈ క్రమంలోనే డోన్, పత్తికొండ టికెట్ ఆశించి భంగపడిన కేఈ ప్రభాకర్( KE Prabhakar ) , ఆలూరు నియోజకవర్గ టికెట్ ఆశించిన మల్లికార్జున చౌదరి( Mallikarjuna Chaudhary ), మంత్రాలయం నియోజకవర్గ టికెట్ ఆశించిన తిక్కారెడ్డితో పాటు పత్తికొండ టికెట్ ఆశించిన మసాలా పద్మజ ( Masala Padmaja )పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈ నలుగురు కీలక నేతలు పార్టీ మారుతారని తెలుస్తోంది.పార్టీ కోసం ఇన్నేళ్లు కష్టపడిన తమను అధినేత చంద్రబాబు పట్టించుకోవడం లేదని నేతల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.