రాజధానిగా అమరావతి వద్దు అని మేము అనలేదు అమరావతి తో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలని ఉద్దేశంతో వికేంద్రీకరణను కోరుకుంటున్నాం.విశాఖ రాజధాని వద్దు అమరావతి ముద్దు అంటూ ఒకే రాజధాని ఉండాలని చెప్పడానికి వాళ్ళు ఎవరు.
వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ కేంద్రంగా పారిశ్రామిక రాజధాని అవసరం.ఇటీవల విశాఖలో మేధావులు విద్యావేత్తలు పారిశ్రామికవేత్తలు తో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి లజపతిరాయ్ చైర్మన్ గా జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది.
దానికి అనుబంధంగా రేపటినుండి ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాలలో రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో నుండి జిల్లా జేఏసీకి అనుబంధంగా కమిటీలు ఏర్పాటు చేస్తాం.
అనకాపల్లి జిల్లాల్లో మూడు మున్సిపాలిటీలో తో పాటు ప్రతి నియోజకవర్గంలో బైక్ ర్యాలీలు కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టి క్షేత్రస్థాయిలో మా నిరసనను ప్రజల్లోకి తీసుకువెళ్లి మరింతగా ఉద్యమిస్తాం.
అక్టోబర్ 15వ తేదీన విశాఖపట్నంలో అంబేద్కర్ విగ్రహం నుండి యూనివర్సిటీ మీదుగా పార్క్ హోటల్ వరకు నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర చేపడతాం.అన్ని నియోజకవర్గాల్లో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశాల్లో లాయర్లు డాక్టర్లు, విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు మేధావులు విద్యావేత్తలు వాణిజ్యవేతలు పాల్గొనవలసిందిగా పిలుపునిస్తున్నాం.
అనకాపల్లి జిల్లాలో అడుగు పెట్టబోతున్న పాదయాత్ర కు ప్రతి ఒక్కరు మన ఉత్తరాంధ్ర నిరసన సెగ తెలియజేయాలి .