సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్న వీడియోలలో కొన్ని వీడియోలు చాలా కోపాన్ని తెప్పిస్తూ ఉంటాయి.ఒక్కోసారి మనుషుల్లోని క్రూరత్వం సందర్భాన్ని బట్టి బయటపడుతూ ఉంటుంది.
అయితే దానికి సందర్భం కావాలి.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిపైన జనాలు తీవ్రస్థాయిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
పిల్లలకు మంచి ఏదో.చెడు ఏదో చెప్పాల్సిన తండ్రే ఇక్కడ ప్రతికార వాంఛ తీర్చుకోవడం ఎంతో అవమానీయం.చిన్నారులు ఆకతాయితనంతో.తెలిసో తెలియక చేసే అల్లరి పనులను గుర్తించి, సరిచేయడం చేయాలి గాని ఇలా దారుణంగా ప్రయత్నించకూడదు.
అయితే ఇక్కడ సరిగ్గా చూస్తే, ఆ వీడియోలో బాలుని తప్పు కనబడకపోవడం గమనార్హం.ఈ అనూహ్య ఘటన చైనాలో చోటు చేసుకోగా ప్రస్తుతం ఆ వీడియోకు సంబందించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల్లోకెళ్తే.చైనా( China )లో గుయ్‌గాంగ్‌లోనో ఓ ప్లే గ్రౌండ్‌లో పిల్లలు పేరెంట్స్ సమక్షంలో ఆడుకుంటూ ఉన్నారు.ఇంతలో ఓ చిన్నారి ఓ తండ్రి( Father ) కూతుళ్లు నుంచొన్న వైపుకి వచ్చి అనుకోకుండా అతడి కూతుర్ని ఢీ కొడతాడు.దీంతో ఆ తండ్రి కోపంతో ఊగిపోతూ ఆ చిన్నారిని హింసిస్తాడు.
ఈ క్రమంలో అభం శుభం తెలియని ఆ చిన్నారిని అమానుషంగా పైకి లేపి మరీ కిందకి విసిరి కొడతాడు.ఏదో వస్తువుని గాల్లోకి విసిరినట్టుగా లేపి నేలపైకి విసిరేశాడు.సరిగ్గా ఆ సమయానికి ఆ చిన్నారి తల్లి వచ్చి అతడితో వాగ్వాదానికి దిగడం ఇక్కడ చూడవచ్చు.ఆ తర్వాత తన పిల్లాడిని అక్కడ నుంచి తీసుకెళ్లిపోయింది.అందుకు సంబంధించిన వీడియోని న్యూయార్క్ పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దానిపైన నెటిజనం చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు.