ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారిన సాప్ట్ వేర్ ఇంజినీర్ రాధ హత్య కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది.రాధను ఆమె భర్త మోహన్ రెడ్డే హత్య చేసినట్లు తెలుస్తోంది.
పోలీసుల విచారణలో నేరాన్ని మోహన్ రెడ్డి అంగీకరించాడు.కనగిరిలో రాధను కారుతో ఢీకొట్టిన అనంతరం రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.
హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని జిల్లెళ్లపాడు వద్ద పడేశాడని తెలిపారు.రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన మోహన్ రెడ్డి తరువాత రాధ స్నేహితుడు కాశిరెడ్డిని హత్య కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని పోలీసులు వెల్లడించారు.మృతురాలు రాధ పేరు మీద రూ.1.5 కోట్ల ఇన్సూరెన్స్ ఉందని తెలిపారు.అయితే స్నేహితుడు కాశిరెడ్డితో రాధకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో భర్త హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు.