దేశంలోని చాలా గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉండిపోతాయి.ఈ క్రమంలో మనం ఏదైనా గ్రామానికి కొత్తగా వెళ్లినప్పుడు, అయ్యో పాపం… ఇక్కడ రోడ్లేమిటి ఇలా వున్నాయి? ఇంకా పూరిండ్లలోనే జీవిస్తున్నారా? ఇక్కడి నాయకులు ఏం చేస్తున్నారు? జనాలు వట్టి గొర్రెల్లాగా ఉన్నారే! అనేటువంటి చాలా అనుమానాలు మన మెదళ్లను తోచేస్తూ ఉంటాయి.అయితే ఆ ఊరికి వెళ్ళినవారు ఆశ్చర్యంలో మునిగిపోతారు.తరువాత శెభాష్ అని సలాం చేస్తారు.ఎందుకంటే.ఆ గ్రామంలో ఆయా పరిస్థితులు మచ్చుకు కూడా మనకు కనబడవు కాబట్టి.

అక్కడ దాదాపుగా అందరూ ధనికులే.ఆ వురి అభివృద్ధిని అక్కడ ప్రతి ఒక్కరూ కాంక్షిస్తారు, ప్రత్యక్షంగా పూనుకుంటారు… ఫలితంగా ఆ గ్రామం ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామం అయ్యింది.ఆ గ్రామం పేరు మాధాపర్( Madhapar) .గుజరాత్‌లోని కచ్ జిల్లాలో కలదు.గుజరాత్‌లో( Gujarat ) ఇలాంటి అనేక గ్రామాలు ఉన్నాయని తెలుస్తోంది.కానీ వాటికి వేటికీ రానంత గుర్తింపు ఈ గ్రామానికి రావడం గమనార్హం.ఈ గ్రామంలోని బ్యాంకుల్లో కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉన్నాయి.నెల నెలా ఈ బ్యాంకుల్లోకి లక్షల మనీ వచ్చి చేరుతుంది.

దానికి కారణం ఉందండోయ్… ఈ గ్రామంలోని అనేక కుటుంబాల వారు విదేశాల్లో నివసిస్తున్నారు.వారు ప్రతి నెలా తమ సంపాదనను ఈ గ్రామంలోని బ్యాంకుల్లో దాచుకుంటున్నారు.మాధాపర్ గ్రామంలో 12 బ్యాంకుల బ్రాంచ్‌లు ఉండగా వాటిలో రూ.2,650 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని భోగట్టా.అందుకే ఈ గ్రామంలో ధనవంతులకు కొరత లేదు.తత్ఫలితంగా గ్రామాభివృద్ధి మెండుగా వుంది.అక్కడి అభివృద్ధిని చూసి బయటి నుంచి వచ్చి చాలా మంది ఈ గ్రామంలో స్థిరపడ్డారని అక్కడ ప్రతినిధులు చెబుతున్నారు.ఈ గ్రామంలో ఒక్క సంఘం కూడా పేదరికంతో లేదు.
గ్రామస్తులకు సమృద్ధిగా నీరు, మౌలిక వసతులు కల్పించడంపై ధనవంతులు దృష్టి సారిస్తున్నారు.







