వైరల్: రోడ్డు వూడ్చుతున్న ట్రాఫిక్‌ పోలీస్‌.. ఎందరికో ఆదర్శం అంటున్న నెటిజన్లు!

పోలీసు వుద్యోగం అనేది ఎంతో బాధ్యతతో కూడిన పని.అయితే ఇక్కడ అంత బాధ్యతతో నడుచుకుంటున్నవారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.

 Viral Video Tamilnadu Traffic Police Sweep Road Become Inspiration To Many Other-TeluguStop.com

అందులోనూ ఒక ట్రాఫిక్‌ పోలీస్‌ పని అనేది ఇంకా ఎక్కువ బాధ్యతతో కూడినది.ప్రతిక్షణం వారికి సవాలుగా ఉంటుంది.

రోడ్డుపైన ట్రాఫిక్ ని క్లియర్ చేయడమంటే మాటలు కాదు.అలాంటిది ఆటను ట్రాఫిక్ ని చూసుకోవడమే కాదు, ఎక్కడ రోడ్డు మీద చెత్తావున్న వెంటనే చీపురును పట్టుకుని ఊడ్చేస్తున్నాడు.

రోడ్డుపై వున్న ఇసుకను, కంకరను క్లియర్ చేస్తున్నాడు.దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ ని ఒక IAS అధికారి ట్వీట్‌ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కంకరను రవాణా చేసే లారీ నుండి కంకర రోడ్డుపై పడటంతో అది వాహనదారులకు నష్టాన్ని చేకూరుస్తుందని తలచి అతను ఎవరికోసమో ఎదురు చూడకుండా తానే స్వయంగా క్లీన్ చేసాడు.ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడగానే చీపురు చేత పట్టి రోడ్డుపై పడిన కంకరను ఓ పక్కకు ఊడ్చారు.

దాన్ని చూసిన ఓ వాహనదారుడు వాహనాలు ఆయన వైపు రాకుండా సహకరించడం మనం గమనించవచ్చు.కాగా, IAS అధికారి అవనీష్ శరణ్ గురువారం తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేయగా వెలుగు చూసింది.

అతను సదరు వీడియోని పోస్ట్ చేస్తూ ‘మిమ్మల్ని గౌరవిస్తున్నా’ అని అందులో పేర్కోవడం విశేషం.అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అన్నది మాత్రం ఆయన ప్రస్తావించలేదు.అయితే రోడ్డును ఊడ్చిన ట్రాఫిక్‌ పోలీస్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.విధి నిర్వాహణలో ఆయన సిన్సియార్టీని చూసి నెటిజన్లు అనేకరకాల కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే ఆ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న వాహనాల నంబర్‌ ప్లేట్‌ ద్వారా ఈ సంఘటన తమిళనాడులో జరిగి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube