పిజ్జా డెలివరీ బాయ్‌కి తోడుగా వెళ్తున్న కుక్క.. వీడియో చూస్తే ఫిదా!

జంతువులు తమ భావాలను మాటల్లో వ్యక్తీకరించలేవు.కానీ తమ యాక్షన్స్‌తో అవి అన్ని విషయాలు చెప్పగలవు.

 Viral Video: Dog Accompanies Pizza Delivery Boy, Pizza Delivery Boy,social Media-TeluguStop.com

మనుషులకు ఎప్పటి నుంచో కుక్క అనేది ఒక బెస్ట్ ఫ్రెండ్‌గా మెలుగుతోంది.విశ్వాసానికి మారుపేరుగా చెప్పే ఈ కుక్కలు తమ యజమానులను విడిచి ఉండలేకపోతున్నాయి.

ఓనర్ ఇంటి నుంచి బయల్దేరిపోతే మళ్లీ తిరిగి వచ్చేదాకా వారికోసమే ఇవి వెయిట్ చేస్తున్నాయి.వీలైతే తమ ఓనర్ వెంట కూడా వెళుతున్నాయి.

ఎందుకంటే అవి క్షణ కాలం కూడా వారిని విడిచి ఉండలేకపోతున్నాయి.

అయితే ఒక డెలివరీ బాయ్ కూడా తనని ప్రాణంగా ప్రేమించే ఓ కుక్కని పెంచుకుంటున్నాడు.

డొమినోస్ పిజ్జా డెలివరీ చేసే ఈ యువకుడిని ఆ కుక్క ఒక్క నిమిషం కూడా వదలదు.బయటికి వెళ్తే తన యజమానికి ఏమౌతుందోనని, లేదా తన యజమానుని తాను మళ్ళీ కలుసుకోలేమోనని భయపడుతుంది.

అందుకే అతనితో కలిసి స్కూటీపై వెళ్తోంది.రోజూ అది ప్రతి డెలివరీకి తన యజమానికి తోడు ఉంటుంది.

వీరి ఫ్రెండ్షిప్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

జులై 31న ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ @beanbag_jr షేర్ చేసిన ఈ వీడియో పోస్ట్‌కు “నిజమైన స్నేహమంటే ఇలానే ఉంటుంది.ఏ సమయంలోనైనా ఈ కుక్క తన యజమాని భద్రతను నిర్ధారించుకోవడానికి ఎల్లప్పుడూ అతనితో వస్తుంది.” అని ఒక క్యాప్షన్ జోడించారు.“ఈ డెలివరీ బాయ్ పేరు జాక్.ప్రతి డెలివరీకి అతనితో కుక్క ఎప్పుడూ వెళ్తుంది.” అని శివంగ్ వివరించారు.

ఇక వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే.

ఒక వ్యక్తి ఓ ఇంటికి పిజ్జా డెలివరీ చేయడం చూడవచ్చు.అతనితోపాటు కుక్క కూడా కనిపించింది.

డెలివరీ బాయ్ తిరిగి బయలుదేరడానికి సిద్ధమవుతున్నప్పుడు, ఆ కుక్క స్కూటర్ దగ్గరకు వెళ్లి అతని ముందు కూర్చుంది.ఆపై డెలివరీ బాయ్ కుక్కతో కలిసి వెళ్ళిపోతాడు.

ఈ వీడియోకి లక్షా అరవై వేలు లైకులు, మిలియన్లలో వ్యూస్ వచ్చాయి.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube