సాధారణంగా ఎవరైనా అధికారులు లంచం తీసుకో బోతున్నానరని తెలుసుకొని అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీ చేస్తారు.ఆ సమయంలో లంచం తీసుకునే అధికారులు లంచం తీసుకున్న డబ్బులు ఎక్కడో ఒకచోట దాచిపెట్టడం లేదా ఎదో ఒక ప్రయత్నం చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.
కానీ తాజాగా ఒక తహసిల్దార్ చేసిన పని మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇంట్లోకి వస్తున్నారు అని తెలియడంతో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 20 లక్షల రూపాయలు డబ్బులు కాల్చేశాడు.
అది కూడా కట్టల కట్టల డబ్బును ఇంట్లో ఉండే గ్యాస్ స్టవ్ ను వెలిగించి మరి కాల్చేశాడు అంటే నమ్మండి.ఈ సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహీ జిల్లాలో ఒక వ్యక్తి నుంచి లక్ష రూపాయలు డబ్బును ఒక తాహసీల్దార్ తీసుకుంటుండగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ పర్వత్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటనపై పర్వత్ ను అధికారులను ప్రశ్నించగా దీంట్లో తన తప్పేమీ లేదని తహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ ఆదేశాలతోనే తాను డబ్బులు తీసుకున్నట్లు తెలియజేశాడు.
దీంతో పర్వత్ ను పట్టుకొని కల్పేశ్ ఇంటికి ఏసీబీ అధికారులు బయలుదేరారన్న విషయం తెలుసుకున్న తహశీల్దార్ తెలుసుకున్న వెంటనే పలువురి వద్ద తీసుకున్న డబ్బులు మొత్తం ఏమి చేయాలో అర్థం కాక చిట్ట చివరకు ఒక నిర్ణయానికి వచ్చి బీరువాలో ఉన్న డబ్బును ఇంటిలో ఉండే వంట గదిలోకి తీసుకొని వెళ్ళాడు.
ఈ క్రమంలో వంటింట్లో వంట గ్యాస్ స్టవ్ ను ఆన్ చేసి ఆ డబ్బులు మొత్తం కాల్చేయడం మొదలు పెట్టాడు.
ఈ పనికి తన భార్య కూడా సహాయం చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.అంతేకాకుండా ఏసీబీ అధికారులు ఎవరూ కూడా ఇంట్లోకి రాకుండా తలుపులకు గడియ పెట్టి మరి ఏకంగా 20 లక్షల రూపాయల నోట్ల కట్టలను కాల్చేశాడు.
ఈ క్రమంలోనే తహసీల్దార్ ఇంటికి ఏసీబీ అధికారులు చేరుకొని ఇంట్లో అతడు చేస్తున్న పనిని గమనించారు. డబ్బును కాల్చేయొద్దని హెచ్చరించినప్పటికీ వారి మాటలు పట్టించుకోకుండా తహసీల్దార్ అదే పనిగా డబ్బులు కాల్చేశాడు.
తలుపులు తీయమని ఎంతగా చెప్పినా కూడా ఆ తహసీల్దార్ అధికారుల మాట వినకుండా అలానే ఆ పనిలో నిమగ్నమయ్యాడు.దీంతో వెంటనే ఏసీబీ అధికారులు ఇంట్లోని తలుపులు పగలగొట్టి ఆ తతంగాన్ని ఆపే ప్రయత్నం చేశారు.
ఈ తరుణంలో మొత్తం 20 లక్షల రూపాయలు కాలిబూడిదైపోయిన కేవలం తాసిల్దార్ నుంచి లక్ష రూపాయలు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు అధికారులు.