సోషల్ మీడియా జనాలకి అందుబాటులోకి వచ్చాక ఎన్నో అద్భుతమైన వీడియోలను తిలకించగలుగుతున్నారు.వాటిలో అందమైన దృశ్యాలను మనం చూసినపుడు మన కళ్లను మనమే నమ్మలేము.
ఈ అనంతమైన ప్రకృతి ఎన్నో వింతలు, విచిత్రాలకు నిలయం.దాంతో దీనికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తూ ఆకట్టుకుంటున్నాయి నేడు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ పింక్ సరస్సు( Pink lake ) చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.విషయం ఏమిటంటే ఆ సరస్సులోని నీరు పూర్తిగా గులాబీ రంగులో వుండడం వలన దానికి ఆ పేరు వచ్చింది.
ఆ వింతను చూసేందుకు పర్యాటకులు తరచుగా అక్కడకు వెళుతుంటారు మరి.
రష్యా( Russia )లోని సైబీరియాలోని ఆల్టై పర్వత ప్రాంతంలో ఈ గులాబీ రంగు సరస్సు కలదు.ఇది పూర్తిగా ఉప్పు నీటి సరస్సు.ఈ సరస్సులోని ఉప్పు ప్రతి సంవత్సరం ఆగస్టులో గులాబీ రంగులోకి మారుతుందని సమాచారం.
ఆర్టెమియా సలీనా అనే సూక్ష్మజీవుల కారణంగానే ఆ ఉప్పు నీటి సరస్సు నీరు పింక్ రంగులోకి మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు.ఆర్టెమియా సాలినా అనేది ఉప్పునీటి రొయ్యల జాతి, ఇవి వందల సంవత్సరాలుగా ఆ సరస్సు అడుగు భాగంలో నివసిస్తున్నాయి.
ఆ కరణంగానే ఈ సైబీరియన్ పింక్ లేక్ చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది.
ప్రస్తుతం ఆ వీడియో TruongPham అనే ట్విటర్ ఖాతాలో షేర్ కాగా ఆ దృశ్యాలు ఎంతోమందిని ఆకట్టుకుంటున్నాయి.ఈ పింక్ నీటి సరస్సు గుండా వేసిన రైలు పట్టాలపై రైలు వెళుతుండడం కూడా చాలా మందిని ఆకట్టుకుంటోంది.ఇంకేముంది, కట్ చేస్తే ఈ వైరల్ వీడియోను ఇప్పటవరకు 23 వేల మందికి పైగా వీక్షించారు.అంతేకాకుండా ఈ అందమైన దృశ్యంపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు.“చాలా అద్బుతంగా ఉంది“ అని కొంతమంది అంటుంటే “ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి“ అంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.