వైరల్: చేపల కూర తినాలని ఏకంగా రైలు ఆపేసిన డ్రైవర్... తరువాత జరిగింది ఇదే!

మీరు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చూసుంటారు.అయితే ఇది వేరే లెవల్ వీడియో అని చెప్పుకోవచ్చు.

 Viral: The Driver Stopped The Train To Eat Fish Curry This Is What Happened Next-TeluguStop.com

బేసిగ్గా మన భారతీయులు ఆహార ప్రియులు.ఎక్కడైనా, ఎప్పుడైనా సరే తమకు నచ్చిన వంటకం ఎక్కడైనా కనబడితే దానిని తినడానికి వెనుకాడరు.

అప్పులు చేసైనా పప్పు కూడు తినే మహానుభావులు మన చుట్టూ ఎంతోమంది వున్నారు.ఆ అప్పుల అప్పారావు సంగతి పక్కనబెడితే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో ఓ బాధ్యతగల ట్రైన్ డ్రైవర్ వెళ్తున్న రైలుని ఆపివేసి మరీ తనకు నచ్చిన చేపల కూరను కొనుక్కొని మరలా ఆ రైలుని స్టార్ట్ చేయడం చాలా స్పష్టంగా చూడవచ్చు.

ఇక్కడే వచ్చింది అసలు చిక్కు.సాధారణంగా ప్రయాణికులు ఓ పది నిముషాలు గేటు పడితేనే చాలా సమయం వృధా అయినట్టు ఫీల్ అవుతారు.

అలాంటిది అకారణంగా సదరు రైలుని ఆపితే ఇంకేమైనా వుంటుందా? ఎవరికైనా కాలుతుంది కదా.ఎవరికి కాలినా కాలకపోయినా మన నెటిజన్లు మాత్రం అతగాడిపైన గుర్రుగా వున్నారు.బేసిగ్గా బైకులోనో, కారులోనో ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు తిని, తాగడానికి మార్గమధ్యంలో ఆగిపోవడం పరిపాటి.అలాంటిది రైలు డ్రైవర్ తినడం కోసం రైలును మధ్యలో ఆపడం మాత్రం చాలా అన్యాయం అని అవాక్కవుతున్నారు.

ఈ ఫన్నీ బన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @HasnaZarooriHai అనే IDతో షేర్‌ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కేవలం 44 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 60 వేలకు పైగా వీక్షించడం విశేషం.అంతేకాకుండా వేల మంది లైక్స్ చేయడం చూడవచ్చు.ఒక వినియోగదారు చేపల మీద ఇష్టం అంటే అట్లుంటది మరి అని కామెంట్ చేస్తే… దాన్నే G బలుపు అని అంటారు అని మరో యూజర్ కొంటెగా కామెంట్ చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube