విజయ్ సేతుపతి కూతురిని రేప్ చేస్తామని వార్నింగ్ ఇచ్చిన సోషల్ మీడియా యూజర్స్

శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 800.ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో నిర్మితమైన ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది.

 Vijay Sethupathi's Daughter Gets Rape Threats After Exit From Muttiah Muralithar-TeluguStop.com

ఈ చిత్రం నుండి తాను తప్పుకుంటున్నట్లు విజయ్ సేతుపతి మీడియాతో మాట్లాడారు.ఇప్పటికే ఈ చిత్రం యొక్క పోస్టర్ విడుదల చేసారు.

వివరాల్లోకి వెళితే ఈ చిత్రం ప్రారంభం అయినప్పటినుండి ఎదో ఒక అంతరాయం కలుగుతుంది.దీనికి మురళీధరన్ చేసిన వ్యాఖ్యలే కారణం.

శ్రీలంక సివిల్ వార్ లో తమిళులను చంపడాన్ని వెనకేసుకొచ్చిన మురళీధరన్, ఈ సినిమా ను రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు.

అయితే ఈ సినిమాలో నటిస్తున్న విజయ్ సేతుపతి కూతురికి సోషల్ మీడియాలో కొందరు అత్యాచార బెదిరింపు కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా ధోని కూతురికి కూడా ఇలాంటి బెదిరింపులు రాగా, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.ఈ విషయాన్ని చిన్మయి శ్రీపాద సీరియస్ గా తీసుకున్నారు.

సోషల్ మీడియా లో అలా పోస్ట్ చేసిన కామెంట్ ను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో చెన్నై పోలీస్ డిపార్ట్మెంట్ మరియు అడయార్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ను టాగ్ చేసి దీనిపై తగిన యాక్షన్ తీసుకోవాలని వారిని కోరారు.ఇలాంటి వాళ్ళ వల్లే ఈ సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేదని, దీనిని ఆపేవాళ్లే లేరా అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube