Leo Movie Review: లియో సినిమా రివ్యూ అండ్ రేటింగ్!

కోలీవుడ్ నటుడు విజయ్ (Vijay) తలపతి హీరోగా లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లియో(Leo).లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఈ సినిమా రావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

 Leo Movie Review: లియో సినిమా రివ్యూ అండ-TeluguStop.com

ఇక ఈ సినిమాలో వివిధ భాషల నుంచి స్టార్ సెలబ్రిటీస్ అందరూ కూడా భాగమయ్యారు.విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ, ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియర్ తదితరులు ఈ సినిమాలో నటించారు.

ఇలా భారీ తారాగణంతో భారీ అంచనాల నడుము ప్రేక్షకుల ముందు కూర్చున్నటువంటి ఈ సినిమా ఆకట్టుకుంది ? ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే…

కథ:

పార్తీబన్ (విజయ్)కు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చిన్న పట్టణంలో కాఫీ షాప్ పెట్టుకుని ఉంటారు ఈయన భార్య సత్య (త్రిష),( Trisha ) ఇద్దరు పిల్లలు (అబ్బాయి, అమ్మాయి)తో సంతోషంగా జీవిస్తున్నాడు.ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను కాపాడిన తర్వాత పార్తీబన్ ( Parthiban ) ఫోటోలు పేపర్ లో వస్తాయి.

దీంతో కథ మొత్తం మారిపోతుంది.అతడిని వెతుకుతూ ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్)( Sanjay Dutt ) గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు.తన కొడుకు లియో దాస్ (విజయ్) మరణించాడని ఇన్నాళ్ళూ అనుకున్నానని, అయితే పార్తీబన్ పేరుతో హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నాడని, నీ భర్త అసలు పేరు పార్తీబన్ అని సత్యతో చెబుతారు.అసలు ఈ లియోదాస్ ఎవరు ఆయన పార్తీబన్ గా ఎందుకు మారిపోయారు ? అసలు ఈ సినిమా కథ ఏంటి అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటీ నటుల నటన:

స్టార్‌డమ్, కమర్షియల్ అంశాలు వంటివి పక్కన పెట్టి విజయ్ నటించారు.ఈ సినిమాలో విజయ్( Thalapathy Vijay ) తండ్రి పాత్రలో కనిపించారు.

విజయ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది.కానీ ఆ క్యారెక్టర్ గ్రాఫ్ కాదు.

ప్రేక్షకులు కోరుకున్న విధంగా విజయ్ నుంచి కమర్షియల్ ఫైట్స్ రావడంతో లోకేష్ కూడా ఈ విషయంలో సక్సెస్ అందుకున్నారు.విజయ్ భార్య పాత్రలో త్రిష ఒదిగిపోయి నటించారు.

త్రిష కూడా ఈ పాత్రకు 100 శాతం న్యాయం చేశారు.ఇక ఇతర నటీనటులంతా కూడా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చెప్పాలి.

Telugu Kollywood, Leo, Leo Review, Leo Story, Review, Sanjay Dutt, Trisha, Vijay

టెక్నికల్:

లోకేష్ విజయ్ తో సరికొత్తగా సినిమా చేసే ప్రయత్నం చేశారు.అయితే అక్కడక్కడ కొన్ని ఎలివేషన్స్ మిస్ అయ్యాయని తెలుస్తోంది.మనోజ్ పరమహంస( Manoj Paramahamsa ) సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్.పతాక సన్నివేశాల్లో కెమెరా మూమెంట్స్ అద్భుతంగా ఉన్నాయి.ఇక సంగీతం విషయానికి వస్తే అనిరుద్( Anirudh Ravichandran ) విక్రమ్, జైలర్ సినిమాలకు ఇచ్చినంతగా బిజీఎం ఈ సినిమాకు అందించలేకపోయారు.పాటల్లో తెలుగు సాహిత్యం బాలేదు.

ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.

Telugu Kollywood, Leo, Leo Review, Leo Story, Review, Sanjay Dutt, Trisha, Vijay

విశ్లేషణ:

లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ సినిమా ఉంటుందా లేదా అన్న సందేహాలు అందరిలోనూ ఉంటాయి.చాలా తెలివిగా విజయ్ సినిమాను తన సినిమాటిక్ యూనివర్స్ కి కనెక్ట్ చేశారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈ రెండు విషయాలు చెప్పడం వల్ల కథకు వచ్చిన ముప్పేమీ లేదు.

యాక్షన్ సీన్లను స్టైలిష్ కొత్తగా తీయడంతో పాటు రేసీ స్క్రీన్ ప్లేతో కథలను ముందుకు నడిపించడంతో తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

Telugu Kollywood, Leo, Leo Review, Leo Story, Review, Sanjay Dutt, Trisha, Vijay

ప్లస్ పాయింట్స్:

సినిమా ప్రారంభంలో హైనాతో ఫైట్, కాఫీ షాపులో షూటవుట్, ‘లియో’ ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్స్ బావున్నాయి. ఇంటర్వెల్ వరకు సినిమా చాలా ఆసక్తిగా కొనసాగింది.త్రిష నటన.

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ తర్వాత కొత్త కొత్త క్యారెక్టర్స్ రావడంతో కాస్త బోరింగ్ అనిపించింది.పెద్దగా ట్విస్టులు ఇచ్చే సన్నివేశాలు ఏమీ లేవు.అనిరుద్ తన మ్యూజిక్ తో పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయారు.

బాటమ్ లైన్:

ఖైదీ, విక్రమ్ తో పాటు LCUను దృష్టిలో పెట్టుకుని వెళితే… అంచనాలు అందుకోవడంలో లియో సినిమా వెనకడుగు పడుతుందనే చెప్పాలి.వీటితో పోల్చకుండా చూస్తే ఈ సినిమా కూడా యాక్షన్ పరంగా పరవాలేదనిపించింది అభిమానులు ఇష్టంగా చూసిన సాధారణ ప్రేక్షకులు ఒకసారి సినిమాని చూడవచ్చు.

రేటింగ్: 2.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube