వీడియో: సూపర్ క్యూట్ డ్యాన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్న టీచర్..

ఆకట్టుకునే పాటలకు అద్భుతమైన డ్యాన్స్‌లు చేస్తూ ఆ ప్రతిభను సోషల్ మీడియా( Social media ) వేదికగా చాలామంది చూపిస్తున్నారు.ఇలాంటి మంచి డ్యాన్స్‌ వీడియోలు విసుగు చెందకుండా గంటల తరబడి చూడవచ్చు.

 Video: Teacher Impresses Everyone With Super Cute Dance.. Viral Video, Latest N-TeluguStop.com

చాలా మంది కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లు తమ స్కిల్స్, క్రియేటివిటీని పంచుకోవడానికి మైక్రో-బ్లాగింగ్ సైట్‌లను ఉపయోగిస్తున్నారు.ప్రముఖ పాటలపై అదిరిపోయే పర్ఫామెన్స్, డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకుంటారు.

అయితే టీచింగ్ రంగంలో ఉన్న వారిలో కూడా అద్భుతమైన డ్యాన్సర్లు ఉంటారు.తాజాగా ఒక టీచర్ కూడా డ్యాన్సింగ్ టాలెంట్ చూపించి అందరినీ ఆకట్టుకుంటుంది.

ఈ స్కూల్ టీచర్( Teacher ) తన స్టూడెంట్స్‌తో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ టీచర్ “గులాబీ షరారా” అనే పహాడీ పాటకు డ్యాన్స్ చేసింది.ఈ వీడియోను @Kajalasudanii ఇన్‌స్టాగ్రామ్‌( Instagram ) పేజీ పోస్ట్ చేసింది.బ్లూ చీరలో ఉన్న ఫిజిక్స్ టీచర్ స్కూల్ యూనిఫారంలో ఉన్న అమ్మాయిలను లీడ్ చేస్తూ కాలు కదిపినట్లు వీడియో చూడవచ్చు.

వారు తరగతి గది వెలుపల, పాఠశాల కారిడార్‌లో చాలా ముచ్చటైన రీతిలో డ్యాన్స్ చేశారు.వారు స్టెప్పులను ఒకే రిథమ్‌తో అద్భుతంగా చేస్తూ ఎంజాయ్ చేశారు.టీచర్ అద్భుతమైన ఎనర్జీతో, నవ్వు ముఖంతో డ్యాన్స్ చేస్తూ అదరగొట్టేసిందనే చెప్పాలి.ఈ టీచర్ వీడియో చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉందని చెప్పవచ్చు.

అందుకే అది ఆన్‌లైన్‌లో చాలా మంది హృదయాలను గెలుచుకుంది.

ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.టీచర్, విద్యార్థుల స్కిల్స్, ఎనర్జీని నెటిజన్లు కొనియాడారు.వారు టీచర్ ఫ్రెండ్లీ, ఫన్-లవింగ్ వైఖరిని కూడా అభినందించారు.

కొంతమంది యూజర్లు ఈ టీచర్ కింద డాన్స్ నేర్చుకోవడానికి ఆ స్కూల్‌లో చేరాలని ఉందని, అలాంటి యాక్టివిటీస్ ఆస్వాదించాలనిపిస్తుందని తమ కోరికను వ్యక్తం చేశారు.అయితే, కొంతమంది యూజర్లు ఈ వీడియోను విమర్శించారు.

స్కూల్‌ డ్యాన్స్ కోసం కాదు, చదువు కోసం అని అన్నారు.ఏదేమైనా ఈ వీడియో పై చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube