వీడియో: మ్యూజిక్‌తో ఆవులను మైమరపిస్తున్న మోడ్రన్ కృష్ణుడు..

హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తే అతని వద్దకు ఆవులు పరిగెత్తుకుంటూ వచ్చేవి.శ్రీకృష్ణుడు వాయించే మ్యూజిక్‌కి అవి పరవశించి పోయేవి.

 Video: Modern Krishna Mesmerizing Cows With Music Cows, Music, Musical Instrumen-TeluguStop.com

అయితే తాజాగా మరో మోడ్రన్ కృష్ణుడు అవతరించాడు.ఈ మోడ్రన్ కృష్ణ సాక్సోఫోన్‌ వాయిస్తుంటే అతని వద్దకు ఆవులని పరిగెత్తుకుంటూ వచ్చాయి.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సంగీతానికి భాష అవసరం లేదని.సంగీతంతో సమస్త జీవుల మనసులను కదిలించవచ్చని ఈ వ్యక్తి నిరూపించాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

వీడియో ప్రకారం.ఓ పొలంలో చాలా ఆవులు గడ్డి వేస్తున్నాయి.ఇంతలోనే ఒక వ్యక్తి సాక్సోఫోన్‌ పట్టుకొని ఆ పొలం గట్టుకు వచ్చాడు.అనంతరం అక్కడే నిలుచుని సాక్సోఫోన్‌ వాయించాడు.

ఆ మ్యూజిక్‌ విన్న కొద్ది క్షణాల్లోనే గడ్డి మేడం ఆపేసి అతను వద్దకు రావడం ప్రారంభించాయి ఆవులు.అలా ఆవులని అతని మ్యూజిక్‌కి ఫిదా అయిపోయి అతని వద్దకు తరలి వచ్చాయి.

అలా అవి మ్యూజిక్ లవర్స్ వలె అతని వద్ద నిల్చొని సంగీతం వింటూ ఎంజాయ్ చేశాయి.

@TansuYegen అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ది పవర్ ఆఫ్ మ్యూజిక్ అని పేర్కొన్నారు.ఈ వీడియోకి 17 లక్షలకు పైగా వ్యూస్, 50 వేల వరకు లైక్ లు  వచ్చాయి.దీన్ని చూసిన ఇండియన్ నెటిజన్లు.“కృష్ణుడి లాగా భలేగా ఆవులను ఆకట్టుకుంటున్నాడుగా.” అని కామెంట్లు పెడుతున్నారు.సంగీతం విని ఆవులు అతని వద్దకు పరిగెత్తుకుంటూ రావడం చూసి చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఇది ఒక ఫారిన్ కంట్రీ లో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

ఎప్పుడు జరిగింది అనేది మాత్రం తెలియరాలేదు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube