Lavanya Tripati : పెళ్లి తర్వాత నువ్వు మారిపోయావు అన్న.. వరుణ్ తేజ్ పై నెటిజన్స్ కామెంట్స్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) పెళ్లి తర్వాత తన కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నారు.

 Varun Tej Actively Pramoting Operation Valentine Movie-TeluguStop.com

ఇక ఇటీవల కాలంలో వరుణ్ తేజ్ కి సరైన హిట్ పడలేదని చెప్పాలి.ఇలా హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి వరుణ్ తేజ్ ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఈయన గత కొంతకాలంగా నటి లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati ) ప్రేమలో ఉంటూ ఈ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేసి గత ఏడాది నవంబర్ ఒకటో తేదీ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

Telugu Lavanya, Valentine, Tollywood, Varun Tej, Varuntej-Movie

ఇక పెళ్లి తర్వాత ఈయన తన వృత్తిపరమైన జీవితంలోనూ అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు.ఇక త్వరలోనే వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ ( Operation Valentine ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా మార్చి ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Telugu Lavanya, Valentine, Tollywood, Varun Tej, Varuntej-Movie

ఈ పాటను మల్లారెడ్డి కాలేజీలో విడుదల చేసిన అనంతరం స్టూడెంట్స్ తో కలిసి చిత్ర బృందం ఇంటరాక్ట్ అయ్యారు.ఈ క్రమంలోనే ఎంతోమంది స్టూడెంట్స్ వరుణ్ తేజ్ తన వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నలు వేయగా ఈయన కూడా ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.దీంతో పలువురు నెటిజన్స్ ఈయన వ్యవహార శైలి పై కామెంట్ చేస్తున్నారు.

ఒకప్పుడు ఇంటర్వ్యూలలో మాట్లాడటానికి కూడా ఎంతో మొహమాట పడే వరుణ్ తేజ్ ఇలా ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నారని ఈయన చాలా మారిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.వరుణ్ ఇలా మారిపోవడానికి కారణం లావణ్య త్రిపాఠినే అని పెళ్లి తర్వాత ఈయనలో ఈ మార్పు వచ్చింది అంటూ నేటిజన్స్ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube