అమెరికా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్.. త్వరితగతిన వీసాల జారీ

అమెరికాకు వెళ్లే భారతీయులకు శుభవార్త.వీసాలు త్వరితగతిన జారీ చేయనున్నట్లు అమెరికన్ రాయబార కార్యాలయం వెల్లడించింది.

 Us India Embassy Taking Steps To Reduce Visa Backlogs In India Details, American-TeluguStop.com

భారతదేశంలో కొంతమంది వీసా దరఖాస్తుదారులు ఇప్పుడు ఇతర దేశాలలో కూడా వాటిని పొందే అవకాశాన్ని కల్పించారు.వీసా కోసం ఎదురు చూసే వారి సంఖ్య తగ్గించడానికి, భారతదేశంలోని కొన్ని కేంద్రాలలో యుఎస్ వీసాల కోసం 800 రోజుల నిరీక్షణ వ్యవధిని తగ్గించడానికి ఈ చర్యలు తీసుకోబడ్డాయి.

భారతదేశంలో యుఎస్ రాయబార కార్యాలయం ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.దీంతో పర్యాటక, వ్యాపార నిమిత్తం అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

Telugu American, India, Indians, Latest, Reducevisa, India Embassy, Usa Nris, Vi

భారతదేశంలోని యుఎస్ రాయబార కార్యాలయం 1 లక్షకు పైగా వీసా దరఖాస్తులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం ఇచ్చింది.ఇంతకు ముందు వీసా దరఖాస్తుదారులు కనీసం 800ల రోజులు వేచి చూసే వారు.ఈ వెయిటింగ్ టైమ్‌ను తగ్గించడానికి అమెరికా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.న్యూఢిల్లీలోని యుఎస్ రాయబార కార్యాలయం, ముంబై, చెన్నై, కోల్‌కతా మరియు హైదరాబాద్‌లోని కాన్సులేట్స్ శనివారం ట్రేడిషన్ వీసా ఇంటర్వ్యూలు అవసరమయ్యే దరఖాస్తుదారులకు వసతి కల్పించడానికి ఏర్పాట్లు తీసుకున్నారు.

Telugu American, India, Indians, Latest, Reducevisa, India Embassy, Usa Nris, Vi

COVID-19 కారణంగా వీసా ప్రాసెసింగ్‌లో బ్యాక్‌లాగ్‌లను తొలగించడానికి చేసిన చర్యలలో భాగంగా అదనపు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.జనవరి-మార్చి మధ్య ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి వాషింగ్టన్, ఇతర రాయబార కార్యాలయాల నుండి డజన్ల కొద్దీ తాత్కాలిక కాన్సులర్ అధికారులు భారతదేశానికి వస్తారు.భారతదేశంలో యుఎస్ మిషన్ రెండు వారాల క్రితం 2,50,000 అదనపు బి 1/బి 2 నియామకాలను విడుదల చేసింది.ఫలితంగా వీసా దరఖాస్తులను పరిశీలించి, వాటికి త్వరితగతిన మోక్షం కల్పించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube