రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెగా కోడలు ఉపాసన కొణిదెల( Upasana Konidela ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగా అలాగే అపోలో హాస్పిటల్ వైఎస్ చైర్మన్గా కూడా సుపరిచితమే.
కాగా ఇటీవల ఉపాసన తల్లి అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే.రామ్ చరణ్, ఉపాసన బిడ్డకు క్లీంకారగా నామకరణం చేశారు.
అయితే మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది.ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపింది.
తన బిడ్డ వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నట్లు వెల్లడించింది.
బిడ్డ పుట్టకు ముందు వరకు కూడా ఎన్నో సామాజిక సేవలు చేసిన ఉపాసన బిడ్డ పుట్టిన తర్వాత కూడా మరింత యాక్టివ్ గా ఉంటూ మరిన్ని మంచి మంచి పనులు చేస్తోంది.సామాజిక సేవలో ఉపాసన ఎప్పుడు ముందుంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇటీవల ఉపాసన ఒంటరి తల్లుల కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.
వారి కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం ఉచిత ఓపీడీ సేవలు అందించనున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు అపోలో చిల్డ్రన్స్( Children of Apollo ) పేరిట జూబ్లీహిల్స్‌లోని( Jubilee Hills) ఆస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది.
ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియోను కూడా షేర్ చేసింది.దీంతో ఉపాసన చేస్తున్న సేవలను నెటిజన్స్ అభినందిస్తున్నారు.
ఉపాసనని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అపోలో చిల్డ్రన్స్ ప్రారంభోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా.
ఒంటరి తల్లుల కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం ఉచిత ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ ఓపీడీ ( OPD )సేవలను పరిచయం చేయడం గర్వకారణం.ప్రతి ఒక్కరూ 040 -23607777 నంబర్‌కు కాల్ చేసి మీ స్లాట్‌ను బుక్ చేసుకోండి.
ఈ సేవలు ప్రతి ఆదివారం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.సంతాన సాఫల్యతతో ఎదురయ్యే సవాళ్లను, ఒంటరి తల్లులను చూసి నేను తీవ్రంగా చలించిపోయను.
ప్రత్యేక శిశువైద్యుల బృందం, అత్యాధునిక సాంకేతికతతో, అపోలో హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం వారి ఆరోగ్య సంరక్షణ ప్రయాణంలో మీ కుటుంబాలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది.ప్రతి బిడ్డకు సమగ్ర సంరక్షణ అందే విధంగా పెంపొందించే వాతావరణాన్ని సృష్టించడం మా లక్ష్యం అని చెప్పుకొచ్చింది ఉపాసన.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.