Sr NTR: నిజమైన పాము ఎన్టీఆర్ మెడకు చుట్టుకున్న కథ మీకు తెలుసా ?

ఇప్పుడు అంటే అందరు మర్చిపోయారేమో కానీ ఒక జెనరేషన్ వెనక్కి వెళ్తే మాత్రం రాముడు, కృష్ణుడు అంటే అందరికి తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్ ( Sr NTR ) మాత్రమే.ఆయన సినిమాలో దేవుడి అవతారం లో( NTR Devotional Roles ) కనిపిస్తే అప్పట్లో జనాలు సిల్వర్ స్క్రీన్ కి హారతులు పట్టేవారు.

 Sr Ntr: నిజమైన పాము ఎన్టీఆర్ మెడకు-TeluguStop.com

ఎందుకు అంటే పురాణాల్లోని దేవుళ్ళు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు.పుస్తకాల్లో రాసిన వాటిని ఆధారం చేసుకొని చిత్రపటాలు అయితే ఉన్నాయ్ కానీ ఎన్టీఆర్ పురాణం లోని పాత్రలు వేసిన తర్వాత అందరు నిజమైన దేవుడు అంటే ఇలాగే ఉంటాడేమో అని అనుకునేవారు.

ఇండియా సినిమా ఇండస్ట్రీ లో దేవుడి పాత్రలకు కేవలం ఎన్టీఆర్ మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవారు.

Telugu Ntr Shivudu, Snake, Sr Ntr, Sr Ntr Snake, Sri Krishna, Sri Rama, Tollywoo

రాముడు అయినా, కృష్ణుడు అయినా, దుర్యోధనుడు మరియు కర్ణుడు పాత్రలు ఎన్టీఆర్ తప్ప ఎవరు చేయలేరు.ఇక ఎన్టీఆర్ శివుడి పాత్రల్లో కూడా బాగానే కనిపించారు.శివుడి పాత్రల్లో నటించాలి అంటే మేడలో ఖచ్చితంగా పాము ఉండాలి.

అయితే అప్పట్లో పాము ( Snake ) మేడలో వేసుకోవాలంటే కొంతమంది భయపడేవారు కానీ అప్పట్లో గ్రాఫిక్ ఈ రేంజ్ లో లేవు కాబట్టి రబ్బర్ పాములను ఎక్కువ గా వాడేవారు.దైర్యంగా ఉండే నటులు అయితే కోరలు పీకేసిన పాములను బాగా ట్రైనింగ్ ఇచ్చి షూటింగ్ కోసం వాడేవారు.

పెటా చట్టాలు లేవు కాబట్టి అప్పట్లో జీవ హింస అనే దానికి స్కోప్ లేదు.

Telugu Ntr Shivudu, Snake, Sr Ntr, Sr Ntr Snake, Sri Krishna, Sri Rama, Tollywoo

ఇక ఎన్టీఆర్ శివుడి పాత్రలో నటిస్తున్న టైం లో కోరలు పీకిన పామును సెట్ కి తీసుకవచ్చారు.ఆ పాములోడు ట్రైనింగ్ ఇస్తున్న టైం లో ఎన్టీఆర్ ఏంటి బ్రదర్ పాముని ఏం చేస్తున్నారు అని అడిగారట.దాంతో పాముకు ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పాడట డైరెక్టర్.

దాన్ని ఆలా వదిలేయండి నాగరాజు కి శివుడి చెంతకు ఎలా చేరాలో నేర్పాల్సిన అవసరం లేదు అని చెప్పరట.దాంతో సదరు డైరెక్టర్ మనకు మెదడు ఉంది కాబట్టి ఆలోచిస్తాం కానీ పాముకు లేదు కదా అంటూ ఎగతాళిగా మాట్లాడాడు అంట.అయినా కూడా ఎన్టీఆర్ కూర్చోగానే ఆ పాము నేరుగా ఆయన మెడలోకి వెళ్లి చేరిందట.అది చూసి సెట్ లో వాళ్లంతా ఆశ్చర్యానికి గురయ్యారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube