పాపం జగన్.. తలనొప్పి తగ్గేనా ?

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jaganmohan Reddy )పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది.తాను ఒకటనుకుంటే కాలం ఇంకో రీతిలో సమాధానం ఇస్తోంది.

 Unexpected Shock For Jagan , Ys Jaganmohan Reddy ,mlc Election ,ycp , Tdp ,brs ,-TeluguStop.com

దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, కాబట్టి ప్రజలు తమ పక్షాననే ఉన్నారని నిన్న మొన్నటి వరకు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు సి‌ఎం జగన్.అందుకే ఏ సభలోనైనా, ఏ సమావేశాల్లోనైనా వైనాట్ 175 అని నినాదంతో చిరునవ్వు చిందిందేవారు జగన్.

అయితే ఎమ్మెల్సీ ఎన్నికల( MLC election )తో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది.ఊహించని విధంగా వైసీపీ( YCP )కి షాక్ ఇచ్చారు పట్టభద్రులు.

Telugu Ap, Chandrababu, Mlc, Visakha Steel, Ys Jagan, Ysjaganmohan-Politics

దీంతో ఇన్నాళ్ళు డ్రీమ్స్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా కళ్ళు తెరిచారు.కళ్ళు తెరిచాక ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, నేతల అసమర్థత.ఇలా అన్నీ లొసుగులు జగన్ ముందు కదలాడుతున్నాయి.ఇంటింటికి తిరిగే ఎమ్మెల్యేలు సైతం ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కోవాల్సివస్తోంది.ఇదిలాగే కొనసాగితే.175 కాదు కదా గెలవడమే గగనం అనే రీతిలో పరిస్థితులు చుట్టుముట్టాయి.దీంతో జగన్ దిక్కు తోచని స్థితిలో తలపట్టుకునే కనిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే మరోవైపు టీడీపీ ఊహించని విధంగా బలం పెంచుకోవడం తీవ్రంగా కలవరపెడుతున్న అంశం.ఇన్నాళ్ళు టీడీపీ( TDP )తోనే, తమకు ఇబ్బంది అనుకున్న జగన్ కు ఇప్పుడు పక్కా రాష్ట్ర పార్టీ బి‌ఆర్‌ఎస్ ( Brs )కూడా షాకుల మీద షాక్ ఇస్తోంది.

Telugu Ap, Chandrababu, Mlc, Visakha Steel, Ys Jagan, Ysjaganmohan-Politics

విశాఖా స్టీల్ ప్లాంట్( Visakha Steel Plant ) విషయంలో కే‌సి‌ఆర్ జోక్యం చేసుకోవడంతో.వైఎస్ జగన్ కు పంటి కింద రాయిలా మారింది.దీంతో వైసీపీ ఎమ్మేల్యేలు కే‌సి‌ఆర్ పై విమర్శలు గుప్పించడం, అటు బి‌ఆర్‌ఎస్ నేతలు కూడా జగన్ అసమర్థ పాలనను ఎండగట్టడం వంటివి చూస్తుండడంతో కే‌సి‌ఆర్, జగన్ ల మద్య ఉండే స్నేహం కాస్త ఉప్పు నిప్పు లాగా మారిపోయినట్లే కనిపిస్తోంది.

దీంతో అనుకోని విధంగా ఎదురవుతున్న ఈ వరుస షాకులు వైఎస్ జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయనే చెప్పవచ్చు.ఇన్నాళ్ళు చంద్రబాబుతోనే ఇబ్బంది అనుకుంటే ఇప్పుడు కే‌సి‌ఆర్ తో కూడా ఇబ్బందులను ఏడుకోవాల్సి వస్తోంది సి‌ఎం జగన్.

మరి తలనొప్పిగా మారిన ఈ పరిస్థితులను సి‌ఎం జగన్ ఎలా అధిగమిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube