ఉక్రెయిన్ విధ్వంసానికి రష్యా కొత్త మార్గం.. అదేంటో తెలిస్తే..

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఒక‌వైపు చ‌ర్చ‌లు న‌డుస్తూనే మ‌రోవైపు యుద్ధం కొనసాగుతోంది.రష్యా సైన్యం ఉక్రెయిన్‌లో పెను విధ్వంసం సృష్టించింది.

 Ukraine War Mysterious Symbols On Ukrainian Buildings Increases Fear In People ,-TeluguStop.com

రష్యా సైన్యం ఉక్రెయిన్ నివాస ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకుంది.ఇప్పటివరకు, ఈ యుద్ధంలో వందలాది మంది ఉక్రేనియన్లు మరణించారు.

ఈ యుద్ధం నేప‌ధ్యంలో కొన్ని రహస్య చిహ్నాలు చర్చనీయాంశంగా మారాయి.ఉక్రెయిన్ ప్రజలు ఈ ర‌హ‌స్య‌ చిహ్నాల గురించి సోషల్ మీడియాలో హెచ్చరిస్తున్నారు.

ఈ చిహ్నాల పట్ల జాగ్రత్త వహించాలని ఉక్రెయిన్ రాజధాని కైవ్ స్థానిక ప్రభుత్వం సోషల్ మీడియాలో ప్రజలను హెచ్చరించింది.ఇటీవ‌ల‌ కీవ్‌లో భవనాల పైకప్పులపై, వీధుల్లో ఒక శిలువ గుర్తులు క‌నిపించాయి.

డైలీ స్టార్ నివేదిక ప్రకారం, రష్యాకు మద్దతు ఇచ్చే వ్యక్తులు ఇటువంటి మార్కులు వేశార‌ని చెబుతున్నారు.ఈ గుర్తుల ద్వారా రష్యన్ క్షిపణులు నేరుగా ఈ భవనాలు,మార్గాలను లక్ష్యంగా చేసుకోగలవు.

ఈ శిలువ గుర్తుకు సంబంధించి సోషల్ మీడియాలో ప‌లు వీడియోలు, వార్నింగ్ మెసేజ్ లు హల్ చల్ చేస్తున్నాయి.

ట్విట్టర్‌లో క‌నిపించే ఒక వీడియోలో భవనం పైకప్పుపై ఉన్న గ్యాస్ పైపు పైన రెడ్ క్రాస్ కనిపిస్తుంది.

కీవ్ స్థానిక ప్రభుత్వం ఎత్తైన భవనం పైకప్పులను తనిఖీ చేయాలని సోషల్ మీడియాలో ప్రజలకు విజ్ఞప్తి చేసింది.అదే సమయంలో చెక్కపై ఇటువంటి ట్యాగ్‌లు పెయింటింగ్ లేదా రిఫ్లెక్టివ్ టేప్‌తో తయారు ఉండవచ్చని ఒక సందేశంలో తెలియ‌జేసింది.

ఈ గుర్తులను ఏదో ఒకదానితో కప్పి ఉంచాలని లేదా తొలగించాల‌ని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఉక్రేనియన్ అధికారులు ప్రధాన కూడళ్లు లేదా మౌలిక సదుపాయాల సమీపంలో చిన్న సూచిక‌ల‌ను ఏర్పాటు చేయాంటూ ప్రజలను అప్రమత్తం చేశారు.

కైవ్ మేయర్ విటాలీ క్లిష్కో దీని గురించిమాట్లాడుతూ.ట్యాగ్ చేసిన‌ ప్రదేశం గురించి చట్ట అమలు సంస్థకు వెంటనే తెలియజేయాలని నగర అధికారులు ప్రజలను కోరారు.అదే సమయంలో రష్యాకు మద్దతు ఇచ్చే వారికి 15 నుండి 20 సంవత్సరాల వ‌ర‌కూ జైలు శిక్ష విధిస్తామని మేయర్ హెచ్చరించారు.ఉక్రెయిన్‌లో రష్యాకు మద్దతు ఇచ్చేవారు అధికంగా ఉన్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube