మీ పిల్లలు ఎప్పుడూ నీరసంగా కనిపిస్తున్నారా.. అయితే వారి డైట్ లో ఇది ఉండాల్సిందే!

మీ పిల్లలు ఎప్పుడూ నీరసంగా కనిపిస్తున్నారా.? చదువుల్లో ఆటపాటల్లో ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదా.? ఎప్పుడూ మంచానికే పరిమితం అవుతున్నారా.? అయితే కచ్చితంగా వారి డైట్ లో ఇప్పుడు చెప్పబోయే స్మూతీని( Smoothie ) చేర్చాల్సిందే.ఈ స్మూతీ ద్వారా పిల్లలకు ప్రోటీన్ తో సహా అనేక పోషకాలు అందుతాయి.అలాగే ఈ స్మూతీ వారిని చురుగ్గా మారుస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

 Best Smoothie For Children Health! Healthy Smoothie, Children Health, Children,-TeluguStop.com

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

ఈ వాటర్ హీట్ అయ్యేలోపు మరొక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లు రాగి పిండి( copper powder ) వేసి కొద్దిగా వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టిన వాటర్ లో వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

Telugu Tips, Latest, Phoolmakhana-Telugu Health

ఈ రాగి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి.ఆ త‌ర్వాత బ్లండర్ తీసుకుని అందులో ఒక కప్పు వేయించిన ఫూల్ మఖానా వేసుకోవాలి.అలాగే ముందుగా తయారు చేసి పెట్టుకున్న రాగి మిశ్రమం, ఐదు గింజ తొలగించిన ఖర్జూరాలు( Dates ), అర కప్పు యాపిల్ ముక్కలు( Apple slices ), అర గ్లాస్ హోమ్ మేడ్ బాదం పాలు, పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా ఫూల్ మఖానా రాగి స్మూతీ సిద్ధం అవుతుంది.

Telugu Tips, Latest, Phoolmakhana-Telugu Health

ఈ స్మూతీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా పిల్లల రెగ్యులర్ డైట్ లో ఈ స్మూతీని కనుక చేరిస్తే వారిలో నీరసం పరార్ అవుతుంది.శక్తివంతంగా మారతారు.చదువుల్లో ఆటపాటల్లో చురుగ్గా పాల్గొంటారు.శారీరక మరియు మానసిక ఎదుగుదల అద్భుతంగా సాగుతుంది.అంతేకాదు పిల్లల డైట్ లో ఈ స్మూతీని చేరిస్తే రక్తహీనత దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.

ఎముకలు దృఢంగా పెరుగుతాయి.రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా కూడా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube