అగ్ర రాజ్యంలో మళ్ళీ పేలిన తూటా...ముగ్గురు మృతి...

అగ్ర రాజ్యం అమెరికా మరో సారి తూటా చప్పుళ్ళతో దద్దరిల్లింది.గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పులలో వేరు వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు తూటాలకు బలై పోయారు.

 Two Officers Shot And Killed At Bridgewater College In Virginia, Us College Sho-TeluguStop.com

అయితే ఈ ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు పోలీసు అధికారులు ఉండగా, మరో చోట జరిగిన కాల్పులలో ఓ విద్యార్ధి మృతి చెందాడు.వివరాలలోకి వెళ్తే.

అమెరికా గత కొన్ని రోజులుగా గన్ కల్చర్ కు దూరంగా ఉంటుందని భావించిన తరుణంలో ఊహించని విధంగా నిన్నటి రోజున ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.రెండు వేరు వేరు చోట్ల కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.

వర్జీనియాలోని బ్రిడ్జ్ వాటర్ కాలేజ్ ప్రాంతంలో ఓ దుండగుడు కాల్పులు జరుపుతూ స్థానికంగా భయాందోళనలు కలిగిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.వారిపై దుండగుడు వరుసగా కాల్పులు ఈ ఘటనలో ఇద్దరు కాలేజ్ క్యాంపస్ అధికారులు మృతి చెందారు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు మృతి చెందిన క్యాంపస్ పోలీసు అధికారులను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనలో అనుమానిత అగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలాఉంటే

అమెరికాలోని మిన్నసోట ప్రాంతంలో కూడా గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు.రిచ్ ఫీల్డ్ సిటీలోని ఓ ఎడ్యుకేషనల్ సెంటర్ వద్ద గుర్తు తెలియని ఆగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఓ విద్యార్ధి అక్కడి కక్కడే మృతి చెందగా మరొక విద్యార్ధి తీవ్రంగా గాయపడ్డాడు.

అక్కడి సిసి టీవీ పుటేజ్ లు ఆధారంగా దుండగుడిని గుర్తించిన పోలీసులు ఆగంతకుడికోసం గాలిస్తున్నారు.ఈ రెండు ఘటనలలో జేఫ్ఫార్సన్, జాన్ పీటర్ అనే ఇద్దరు క్యాంపస్ పోలీసులను తాము కోల్పోయామని ఉన్నత అధికారులు ప్రకటించారు.

ఈ ఘటనపై ప్రజా సంఘాలు బగ్గుమన్నాయి.గన్ కల్చర్ పై ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని, బిడెన్ ఇచ్చిన ఈ హామీని నెరవేర్చడం లేదని మండిపడుతున్నాయి.

Two Officers Shot And Killed At Bridgewater College In Virginia, US College Shootings US, Gun,Gun Culture,Bridgewater College Shooting - Telugu Bridgewater, Gun

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube