అగ్ర రాజ్యంలో మళ్ళీ పేలిన తూటా...ముగ్గురు మృతి...

అగ్ర రాజ్యం అమెరికా మరో సారి తూటా చప్పుళ్ళతో దద్దరిల్లింది.గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పులలో వేరు వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు తూటాలకు బలై పోయారు.

అయితే ఈ ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు పోలీసు అధికారులు ఉండగా, మరో చోట జరిగిన కాల్పులలో ఓ విద్యార్ధి మృతి చెందాడు.

వివరాలలోకి వెళ్తే.అమెరికా గత కొన్ని రోజులుగా గన్ కల్చర్ కు దూరంగా ఉంటుందని భావించిన తరుణంలో ఊహించని విధంగా నిన్నటి రోజున ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.

రెండు వేరు వేరు చోట్ల కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.వర్జీనియాలోని బ్రిడ్జ్ వాటర్ కాలేజ్ ప్రాంతంలో ఓ దుండగుడు కాల్పులు జరుపుతూ స్థానికంగా భయాందోళనలు కలిగిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

వారిపై దుండగుడు వరుసగా కాల్పులు ఈ ఘటనలో ఇద్దరు కాలేజ్ క్యాంపస్ అధికారులు మృతి చెందారు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు మృతి చెందిన క్యాంపస్ పోలీసు అధికారులను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో అనుమానిత అగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదిలాఉంటే అమెరికాలోని మిన్నసోట ప్రాంతంలో కూడా గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు.

రిచ్ ఫీల్డ్ సిటీలోని ఓ ఎడ్యుకేషనల్ సెంటర్ వద్ద గుర్తు తెలియని ఆగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఓ విద్యార్ధి అక్కడి కక్కడే మృతి చెందగా మరొక విద్యార్ధి తీవ్రంగా గాయపడ్డాడు.

అక్కడి సిసి టీవీ పుటేజ్ లు ఆధారంగా దుండగుడిని గుర్తించిన పోలీసులు ఆగంతకుడికోసం గాలిస్తున్నారు.

ఈ రెండు ఘటనలలో జేఫ్ఫార్సన్, జాన్ పీటర్ అనే ఇద్దరు క్యాంపస్ పోలీసులను తాము కోల్పోయామని ఉన్నత అధికారులు ప్రకటించారు.

ఈ ఘటనపై ప్రజా సంఘాలు బగ్గుమన్నాయి.గన్ కల్చర్ పై ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని, బిడెన్ ఇచ్చిన ఈ హామీని నెరవేర్చడం లేదని మండిపడుతున్నాయి.

కూటమి నేతలపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శలు