గుర్తు తెలియని వాహనం బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.ఈ ఘోర రోడ్డు ప్రమాదం తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
వాహనం బైక్ ను ఢీకొన్న తర్వాత అక్కడి నుంచి ఆపకుండా వెళ్లిపోయింది.స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ కొనసాగించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.తూర్పు గోదావరి జిల్లా కాజలూరు మండంలోని జగన్నాథగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై వేగంగా వస్తున్న ఓ వాహనం ఢీకొంది.దీంతో బైక్ పై ఉన్న వ్యక్తులకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
బైక్ ని ఢీకొన్న ఆ వాహన డ్రైవర్ భయంతో ఆపకుండా వెళ్లిపోయాడని స్థానికులు చెబుతున్నారు.కాగా, మృతులు రామచంద్రాపురానికి చెందిన లక్ష్మణ్, ద్రాక్షారామానికి చెందిన రామ్ లక్ష్మణ్ గా గుర్తించారు.
వీరిలో ఒకరూ సెల్ షాప్ యజమానిగా, దుకాణం పని చేసే వ్యక్తి మరొకరని, పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరే సమయంలో ఈ ప్రమాదం సంభవించిందన్నారు.స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించండం జరిగిందన్నారు.
కేసు విచారణలో ఉందని, ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.