ప్రస్తుత కాలంలో కొందరు అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం కోసం ఎన్నో ఆశలతో సినీ పరిశ్రమకు వస్తున్నటువంటి యువ నటీనటులకు అవకాశాల పేరుతో లొంగ తీసుకుని వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు.తాజాగా కొందరు కేటుగాళ్లు యూట్యూబ్ మరియు టెలివిజన్ చానళ్లలో పని చేసే టువంటి కొంతమంది యాంకర్ల కి డబ్బు ఎరగా వేస్తూ వ్యభిచారం చేయిస్తున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నంలో పేరు మోసిన బడాబాబులు సినీ పరిశ్రమతో సంబంధం ఉన్నటువంటి కొందరు వ్యక్తులతో సత్ససంబందాలు పెట్టుకొని అవకాశాల పేరుతో సినీ పరిశ్రమకు వచ్చే యువతులను వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు.అంతేగాక ఈ యువతుల ఫోటోలను వాట్స్అప్ మరియు ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేస్తూ ఆన్ లైన్ వ్యభిచారానికి కూడా పాల్పడుతున్నట్లు ఇటీవల పలువురు ఆరోపిస్తున్నారు.
అయితే తాజాగా పక్కా సమాచారంతో రైడ్ చేసినటువంటి పోలీసులు ఓ వ్యభిచార గృహంలో పలువురు యువతులను కూడా విటులతో కలిపి పట్టుకున్నారు.
దీంతో కొంతమేర పోలీసులు పట్టణంలో వ్యభిచార గృహాలపై ప్రత్యేక నిఘా విధించారు.
దీంతో అప్రమత్తమైన వ్యభిచార గృహ నిర్వాహకులు యువతులను విటులు కోరుకున్న ప్రదేశాలకే సరఫరా చేస్తున్నారు.అయితే ఈ బాగోతం వెనుక స్థానిక ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు.
దీంతో పోలీసులు ఆ రాజకీయ నాయకుడు ఎవరో కనిపెట్టే పనిలో పడినట్లు సమాచారం.