రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్లోలం చెలరేగింది.ఇటీవల మంత్రివర్గం నుంచి తొలగించబడిన మాజీ మంత్రి రాజేంద్రసింగ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
అశోక్ గెహ్లాట్ రహస్యాలను బయటపెడతానంటూ రాజేంద్ర సింగ్ రెడ్ డైరీ పట్టుకుని అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.కాగా అశోక్ గెహ్లాట్ రహస్యాలు అన్నీ రెడ్ డైరీలో ఉన్నాయని రాజేంద్ర సింగ్ చెబుతున్నారు.
అయితే రాజేంద్రసింగ్ కు అసెంబ్లీ స్పీకర్ మాట్లాడే అవకాశాన్ని కల్పించలేదు.అనంతరం ఆయనను అసెంబ్లీ నుంచి స్పీకర్ బయటకు పంపారు.
ఈ క్రమంలో రాజస్థాన్ అసెంబ్లీ ఎదుట హై డ్రామా నెలకొంది.కాగా గత వారం రాజస్థాన్ లో మహిళల భద్రతపై ప్రభుత్వాన్ని రాజేంద్రసింగ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆయనను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించారనే వాదనలు వినిపిస్తున్నాయి.మరోవైపు రెడ్ డైరీ రహస్యాలు బయటపెట్టాలని బీజేపీ డిమాండ్ చేశారు.