డ్రీమర్ల కి పౌరసత్వం ఇస్తాం ట్రంప్...కానీ..???

మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం కోసం ట్రంప్ చేయని జిమ్మిక్కులు లేవు.అందుకోసం ఎలా డెమొక్రాట్లని ఒప్పించాలో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం ట్రంప్ కి ఎదురవుతోంది.

 Trump About Dreamers Facilities In America-TeluguStop.com

తాజాగా ట్రంప్ గోడ నిర్మాణానికి తన మార్గం సుగమం చేసుకోవడానికి సరి కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చారు.ఈ ప్రతిపాదన ప్రకారం.దేశంలో సరైన

డాక్యుమెంట్లు ఉద్యోగాలు చేస్తున్న ఏడు లక్షల మంది డ్రీమర్స్ కి సరైన రక్షణ చర్యలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అయితే డెమొక్రాట్స్ ససేమిరా అనడంతో మళ్ళీ గోడ వివాదం కొనసాగుతోంది.అమెరికా వెళ్లి సంతోషంగా జీవించాలని లక్ష్యంతో చొరబడిన వారిని డ్రీమర్స్ అంటారు అయితే వారికి పౌరసత్వం ఉండదు కాని వీరికి సైతం ఉద్యోగ భద్రత తో పాటు దేశం నుంచీ పంపకుండా ఉండేలా వెసులుబాటు ఇస్తామని ట్రంప్ ముందుకు వచ్చారు.

అంతేకాదు సుమారుగా 805 మిలియన్ డాలర్లను ఖర్చుపెట్టి డ్రగ్స్ కి అలవాటు పడిన వారిని ఆ వ్యసనం నుంచీ బయటపడేలా విముక్తుల్ని చేస్తామని అన్నారు.అయితే ఎన్ని ప్రకటనలు ట్రంప్ చేసినా సరే వాటిని స్పీకర్ నాన్సీ పెల్సీ తిరస్కరించారు.దాంతో రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube