అమెరికాలో భారతీయ సిక్కుపై దాడి.

అగ్రరాజ్యం అమెరికాలో మరో సారి భారతీయుడిపై జాతివిద్వేష దాడి జరిగింది.గతంలో ఎన్నో సార్లు భారతీయులపై ఈ దాడులు జరగడంతో భారత ప్రభుత్వం నుంచీ అమెరికాలో ఉన్న భారతీయ వ్యక్తుల నుంచీ నిరసనలు పెల్లుబకడంతో అమెరికా ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ రకమైన దాడులు మళ్ళీ జరగలేదు.అయితే

 Harwinder Singh Targeted On Monday By A 24 Year Old Andrew Ramsey-TeluguStop.com

మళ్ళీ చాలా కాలం తరువాత ఓ సిక్కు మతస్తుడిని ఓ అమెరికన్ పౌరుడు ఇష్టం వచ్చినట్లుగా చితకబాది , ముఖంపై పిడిగుద్దులు గుద్ది తీవ్రంగా గాయపరిచిన సంఘటన తాజాగా జరిగింది.దాంతో మరో సారి అమెరికాలో భారతీయులు ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు.అమెరికాలో ని ఓరెగాన్ రాష్ట్రంలో సోమవారం ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే.సిక్కు మతస్తుడైన హరిద్వార్ సింగ్ అక్కడే ఉన్న ఒక షాపులో పని చేస్తున్నాడు.అయితే అక్కడికి ఆండ్రూ రామ్సే అనే 24 ఏండ్ల శ్వేత జాతీయుడు సిగరెట్ చుట్టే పేపర్ల కొనుగోలు కోసం వచ్చాడు.కాని అవి కొనడానికి అతడి దగ్గర గుర్తింపు కార్డు లేకపోవడంతో హరి ద్వార్ వాటిని అమ్మలేదు దాంతో అతడు హరిద్వార్ పై దాడి చేశాడు.

అయితే ఈ కేసుని నమోదు చేసుకున్న పోలీసులు అతడిని త్వరలో న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube