Tripti Dimri : యానిమల్ లో బోల్డ్ సీన్స్ చేసిన ఈ బ్యూటీ విరాట్ కు చెల్లి అవుతుందా.. ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

రణబీర్ సింగ్, రష్మిక మందన కలిసి నటించిన తాజా చిత్రం యానిమల్.( Animal movie )సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన విషయం తెలిసిందే.

 Tripti Dimri Dating With Anushka Sharma Brother-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రాణిస్తూ దూసుకుపోతోంది.అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక కంటే సెకండ్ హీరోయిన్గా నటించిన త్రిప్తి దిమ్రి ( Tripti dimri )ఎక్కువ హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు రష్మిక కంటే ఆమె గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

జోయాగా ఆమె క్యారెక్టర్ కు, రొమాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Telugu Animal, Anushka Sharma, Bollywood, Brother, Karnesh Ssharma, Tripti Dimri

నేషనల్ క్రష్ గా ఉన్న రష్మికను కూడా పక్కన పెట్టి ఈ సినిమా రిలీజ్ అయ్యిన దగ్గర నుంచి ఆమెను నేషనల్ క్రష్ గా మార్చేశారు.ఇక అమ్మడు వరుస అవకాశాలను అందుకొని ఇండస్ట్రీ మొత్తానికి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ లో ఈ చిన్నది ఛాన్స్ పట్టేసిందని టాక్.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఈ భామ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెల్లెలు అనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.కాగా త్రిప్తి దిమ్రి( Tripti dimri ) హిందీలో బుల్ బుల్ అనే సినిమాలో నటించింది.

ఆ సినిమాకు నీమాత కర్నేష్ శర్మ( Karnesh Ssharma ).స్వయానా హీరోయిన్, విరాట్ భార్య అనుష్క శర్మకు అన్నయ్య.

Telugu Animal, Anushka Sharma, Bollywood, Brother, Karnesh Ssharma, Tripti Dimri

ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక్క వీరిద్దరూ కలిసి పార్టీలు, పబ్ లు అంటూ తిరిగారట.త్వరలోనే ఈ జంట వివాహం కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.విరాట్ కు కర్నేష్ బావ అంటే త్రిప్తి చెల్లి వరుసనే కదా అయ్యేది.అందుకే విరాట్ చెల్లి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.అయితే కొన్ని రోజుల క్రితమే ఈ జంట విడిపోయిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

ఇద్దరు ఒకరిని ఒకరు ఇన్స్టాగ్రామ్ నుంచి అన్ ఫాలో చేసుకోవడమే కాకుండా తాము కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేశారు. దీంతో ఈ జంట బ్రేకప్ చేసుకున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube