Tripti Dimri : యానిమల్ లో బోల్డ్ సీన్స్ చేసిన ఈ బ్యూటీ విరాట్ కు చెల్లి అవుతుందా.. ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

రణబీర్ సింగ్, రష్మిక మందన కలిసి నటించిన తాజా చిత్రం యానిమల్.( Animal Movie )సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రాణిస్తూ దూసుకుపోతోంది.అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక కంటే సెకండ్ హీరోయిన్గా నటించిన త్రిప్తి దిమ్రి ( Tripti Dimri )ఎక్కువ హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు రష్మిక కంటే ఆమె గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

జోయాగా ఆమె క్యారెక్టర్ కు, రొమాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. """/" / నేషనల్ క్రష్ గా ఉన్న రష్మికను కూడా పక్కన పెట్టి ఈ సినిమా రిలీజ్ అయ్యిన దగ్గర నుంచి ఆమెను నేషనల్ క్రష్ గా మార్చేశారు.

ఇక అమ్మడు వరుస అవకాశాలను అందుకొని ఇండస్ట్రీ మొత్తానికి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ లో ఈ చిన్నది ఛాన్స్ పట్టేసిందని టాక్.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే ఈ భామ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెల్లెలు అనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.కాగా త్రిప్తి దిమ్రి( Tripti Dimri ) హిందీలో బుల్ బుల్ అనే సినిమాలో నటించింది.

ఆ సినిమాకు నీమాత కర్నేష్ శర్మ( Karnesh Ssharma ).స్వయానా హీరోయిన్, విరాట్ భార్య అనుష్క శర్మకు అన్నయ్య.

"""/" / ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.ఇక్క వీరిద్దరూ కలిసి పార్టీలు, పబ్ లు అంటూ తిరిగారట.

త్వరలోనే ఈ జంట వివాహం కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.విరాట్ కు కర్నేష్ బావ అంటే త్రిప్తి చెల్లి వరుసనే కదా అయ్యేది.

అందుకే విరాట్ చెల్లి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.అయితే కొన్ని రోజుల క్రితమే ఈ జంట విడిపోయిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

ఇద్దరు ఒకరిని ఒకరు ఇన్స్టాగ్రామ్ నుంచి అన్ ఫాలో చేసుకోవడమే కాకుండా తాము కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేశారు.

దీంతో ఈ జంట బ్రేకప్ చేసుకున్నారని తెలుస్తోంది.

ఓవర్సీస్ లో కల్కి ఫస్ట్ డే కలెక్షన్ల లెక్కలివే.. సరికొత్త రికార్డ్ సొంతం చేసుకుందిగా!