బాలీవుడ్ బాదుషా షా రుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన సినిమా జవాన్( Jawan movie )తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపిస్తోంది.
రిలీజ్ అయ్యి వారం రోజులు కాకముందే, ఈ చిత్రం 500 కోట్ల మార్క్ ను చేరుకుందని సమాచారం.ఎన్నో ఏళ్లుగా తన ఇమేజ్ కు తగ్గ హిట్ పడక ఇబ్బంది పడుతున్న షా రుఖ్ ఖాన్ కు ఈ ఏడాది ఇది రెండో బ్లాక్ బస్టర్.
షా రుఖ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫిలింగా నిలిచింది జవాన్.ఐతే ఈ చిత్రానికి అట్లీ ముందుగా సంప్రదించింది షా రుఖ్ ని కాదట.
ఈ కథ షా రుఖ్ కి చెప్పక ముందు, కొందరు తెలుగు హీరోలకు ఈ కథను వినిపించాడట.ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూదాం.
ముందుగా అట్లీ జవాన్ కథను మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు వినిపించాడట.ఐతే ఈ కథ బాగానే ఉన్నప్పటికీ, కథలో కొన్ని విభిన్న అంశాలు ఉండడం వలన రామ్ చరణ్ ఈ కథను రిజెక్ట్ చేసాడట. ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయ్యాడు.అందుకే అట్లీ రామ్ చరణ్( Ram charan )తో ఈ కథ తీసిస్తే అన్ని వర్గాల ప్రేక్షకులకు, అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అనుకున్నాడట.
కానీ అట్లీ కోరిక ఫలించలేదు.
ఆ తరువాత ఇదే కథను మన సూపర్ స్టార్ మహేష్ బాబు కి కూడా వినిపించాడట.కానీ మహేష్( Mahesh babu ) కూడా ఈ టైం లో ఒక డిఫరెంట్ స్టోరీ తో రిస్క్ తీసుకోవడానికి ముందుకు రాలేదట.దాంతో అట్లీ ఏకంగా బాలీవుడ్ బాదుషానే పట్టుకున్నాడు.
మన తెలుగు హీరోలు కాదన్నాక అట్లీ ఈ సినిమా షా రుఖ్ తో తియ్యాలని డిసైడ్ అయ్యాడట.కానీ మొదట షా రుఖ్ అప్పోయింట్మెంట్ కూడా దొరకలేదట.
కానీ మెల్లగా షా రుఖ్ ని కలిసి కథ వినిపించాడు.కథ బాగా నచ్చడంతో షా రుఖ్ ఈ సినిమాలో నటించడమే కాకుండా తానే ప్రొడ్యూస్ కూడా చేసాడు.
ఇప్పుడు లాభాలలో మునిగి తేలుతున్నాడు.