సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ సత్తా చాటిన స్టార్ హీరోయిన్లు..

సినిమాలకు, రాజకీయాలకు ఎంతో దగ్గరి సంబంధం ఉంది.ఎంతో మంది సినీ తారలు రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఉన్నత స్థానాలకు చేరారు.

 Tollywood Heroines Who Ruled Politics, Tollywood, Politics, Kollywood, Jayalalit-TeluguStop.com

సినిమాల్లోనే కాదు.రాజకీయాల్లోనూ తమకు ఎదురు లేదని నిరూపించుకున్నారు.

వారిలో పలువురు హీరోయిన్లు కూడా ఉన్నారు.తమ అందచందాలతో వెండి తెరను ఏలిన ముద్దుగుమ్మలు.

రాజకీయాల్లో అద్భుతంగా రాణించారు.తమిళనాడు ముఖ్యమంత్రిగా పాలించిన జయలలిత మొదలు కొని పలువురు హీరోయిన్లు పాలిటిక్స్ లో తిరుగులేదని నిరూపించుకున్నారు.ఇంతకీ రాజకీయాల్లో రాణించిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

జయసుధ

టాలీవుడ్ లో సహజన నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు. 2009లో రాజకీయాల్లోకి వచ్చింది.అదే ఏడాది కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది.2014లో ఓడిపోయింది.ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా లేదు.

జయప్రద

ఒకప్పటి ఈ ముద్దుగుమ్మ 1994లో టీడీపీలో చేరింది.96లో రాజ్యసభ సభ్యురాలు అయ్యింది.ఆ తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చి ఎస్పీలో చేరింది.యూపీ నుంచి ఎంపీగా గెలిచింది.రెండుసార్లు ఎంపీ అయిన తను 2019లో బీజేపీలో చేరింది.జయసుధ.

నగ్మా

ఒకప్పుడు కుర్రకారుకు కునుకు లేకుండా చేసిన నగ్మా.2004లో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యింది.2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైంది.2015లో నగ్మా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ కు జనరల్ సెక్రెటరీగా నియామకం అయ్యింది.

నవనీత్ కౌర్

తెలుగులో పలు సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది.2019లో స్వంతంత్ర అభ్యర్థిగా మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచింది.

రోజా

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నరోజా.తొలుత టీడీపీలో చేరింది.2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.అనంతరం వైసీపీలో చేరింది.2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి విజయం సాధించింది.

జయలలిత

సినిమా రంగంలో అద్భుతంగా రాణించిన జయలలిత.ఆ తర్వాత రాజకీయాల్లోనూ తిరుగులేని ముద్ర వేసింది.ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీలో 1984లో చేరిన జయలలిత.నెమ్మదిగా ఎదిగింది.1991లో తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టింది.అనంతరం పలుమార్లు తమిళ సీఎం అయ్యింది.2016లో సీఎంగా కొనసాగుతూనే చనిపోయింది.

అటు సీనియర్ హీరోయిన్ సుమలత కర్ణాటక మాండ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచింది.అటు పెళ్లి పుస్తకం హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్యవాణి ప్రస్తుతం టీడీపీ నాయకురాలిగా కొనసాగుతుంది.

Tollywood Heroines Who Ruled Politics

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube