అమ్మాయి బాగుంది అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిజంగానే అమ్మాయి బాగుంది అనిపించుకున్న ముద్దుగుమ్మ మీరా జాస్మిన్( Meera Jasmine ).తెలుగు లో మీరా జాస్మిన్ కొన్నాళ్ల పాటు స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంది.
కానీ ఆ తర్వాత మాత్రం ఈ అమ్మడు ఆఫర్లు దక్కించుకోలేక పోయింది.ఇండస్ట్రీ కి కొన్నాళ్లు పూర్తిగా దూరం ఉంది.
కానీ ఇప్పుడు రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తోంది.ఇటీవలే ఒక సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పింది.
సినిమా ల్లో నటించేందుకు అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.మొత్తానికి మీరా జాస్మిన్ సోషల్ మీడియా ద్వారా తెగ హడావుడి చేస్తోంది.హీరోయిన్ గా రీ ఎంట్రీ( Meera jasmine Re entry ) ఇచ్చేందుకు బాలీవుడ్ హాట్ బ్యూటీస్ రేంజ్ లో అందాల ప్రదర్శణ చేస్తోంది.ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఇంకా ఈమె సొంతం.
అందుకే ఇండస్ట్రీ లో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు అయినా… వయసు నాలుగు పదులకు చేరువ అయినా కూడా కూడా అందంగా కనిపిస్తోంది.రీ ఎంట్రీ కోసం తీవ్రంగా తాపత్రయ పడుతోంది.
ఈ అమ్మడి యొక్క అందాల విందు కు సినీ జనాలు కూడా వావ్ అంటూ ఫోటోలు షేర్ చేస్తున్నారు.ఈ రేంజ్ లో స్కిన్ షో( Meera Jasmine Galmorous Photos ) చేస్తే యంగ్ హీరోలు కూడా ఆమె తో నటించేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉందని.ముందు ముందు సీనియర్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్ల ను ఈమెకు పిలిచి మరీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అతి త్వరలోనే ఈ అమ్మడు తెలుగు లో ఒక సినిమా ను చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వెండి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.