తెలుగులో ప్రముఖ దర్శకుడు మార్తాండ.కే శంకర్ దర్శకత్వం వహించిన “ఎవరైనా ఎపుడైనా” చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయమైన మలయాళ బ్యూటీ “విమలా రామన్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే విమలా రామన్ వచ్చీ రావడంతోనే పర్వాలేదనిపించినప్పటికీ ఎందుకో ఎక్కువ కాలం హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగలేక పోయింది.కాగా ఈమె కి నటనలోనే కాకుండా భరత నాట్యం లో కూడా మంచి ప్రావీణ్యం ఉండటంతో ప్రస్తుతం సినిమాలపై కొంతమేర దృష్టి తగ్గించినట్లు తెలుస్తోంది.
దీంతో దేశ వ్యాప్తంగా నాట్య ప్రదర్శనలు కూడా ఇస్తోంది.అయితే తెలుగులో చివరగా ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన “ఓం నమో వెంకటేశాయ” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు టాలీవుడ్ సినిమాల్లో నటించలేదు.అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో నటి విమలారామన్ నటించిన “ఎవరైనా ఎప్పుడైనా, గాయం-2, రంగా ది దొంగ, రాజ్, చట్టం కులుమనాలి, తదితర చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. అయితే ఇందులో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
దీంతో ఈ అమ్మడికి కొత్త చిత్రాల అవకాశాలు పెద్దగా తలుపు తట్టలేదు.దీంతో పబ్ గోవా అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.