ఇండస్ట్రీలో పి.వాసు గారు అనే కో-డైరెక్టర్ ఉండేవారన్న నటి సుధ, ఒక సినిమా షూటింగ్ చేస్తున్నపుడు తనకు మూడ్ బాలేదా, ఇంకేమైందో తనకు గుర్తులేదని ఆమె ఇలా చెప్పుకొచ్చారు.
అయితే అలా షూటింగ్ జరుగుతున్నపుడు డాన్స్ మాస్టర్ సుందరం మాస్టర్ తనకు ఒక మూమెంట్ నేర్పిస్తుండగా తనకు ఎంత సేపటికీ ఆ స్టెప్ రాకపోవడంతో ఆయన ఒక మాట అన్నారని ఆమె చెప్పారు.ఆ మాటతో అంతా బ్లాంక్ అయిపోయి ఒక సెకన్ అలానే చూస్తుండిపోయి, అక్కడినుంచి ఏడుస్తూ వెళ్లిపోయానని ఆమె అన్నారు.
అక్కడ అప్పటికే చాలా మంది ఉన్నారని, అలా ఆయన అందరి ముందూ గట్టిగా అనేసరికి చాలా ఫీలయినట్టు ఆమె తెలిపారు.
ఇక అక్కడ ఉన్నది చిన్న ఆర్టిస్ట్ కానీ, పెద్ద ఆర్టిస్ట్ కానీ, కానీ అక్కడ ఆయన అన్న మాట చాలా తప్పని ఆమె చెప్పారు.
ఆ తర్వాత అక్కడనుంచి వెళ్లి తన అమ్మతో జరిగిందంతా చెప్పానని అన్నారు.ఇక ఆయనుండగా ఈ మూవీ చేయకు.రేపు ఆయనే ఒక డైరెక్టర్ అవుతారు.నీ దగ్గరికి వచ్చి అడుగుతారు.
అప్పుడు ఆయన పిక్చర్ నువ్వు చేయాలని తన అమ్మ అన్నట్టు ఆమె చెప్పారు.
ఇకపోతే అది జరిగిన 6నెలలలోపే ఆయన డైరెక్టర్ మారి వచ్చారు.
అప్పుడే ఒక మూవీ షూటింగ్లో మామూలుగా కూర్చున్నపుడు సుందరం మాస్టర్ అక్కడికి వచ్చారని, ఆయన్ని చూసి తన మదర్‌తో ఆయన ఎందుకొచ్చారు అని అడిగినట్టు ఆమె చెప్పారు.ఆయన సినిమా చేయాలని అడిగేందుకు వచ్చినట్టు తన అమ్మ చెప్పేసరికిఅందరి ముందు అలా నన్ను తిట్టాడు తన ఈ సినిమా లో కోటి రూపాయలు ఇచ్చిన నేను చేయనని కరాఖండిగా చెప్పినట్టు ఆమె తెలిపారు.దానికి తన మదర్ తనను కొట్టడానికి వచ్చినట్టే మీదకు వచ్చారు.నిజానికి తన తల్లిదండ్రులు అప్పటివరకు కనీసం తనపై ఒక్క సారి కూడా చేయి చేసుకోలేదన్న సుధ, ఎందుకు అలా చేస్తున్నావని తన మదర్‌ను అడిగినట్టు చెప్పారు.
దానికి తన తల్లి ఆ రోజు నీకేమని చెప్పాను, ఆయన ఆ రోజు అన్న మాట తప్పు అని, అలా తప్పు చేశానని ఆయనకు తెలియాలి, కాబట్టి నువ్వు చేయాలి.ప్రతి రోజూ నువ్వు నటించేటపుడు ఆయన అయ్యో ఇంత మంచి ఆర్టిస్ట్‌ను బాధపెట్టాం కదా అని ఆయన ఫీలవాలని తన మదర్ తనకు చెప్పినట్టు ఆమె తెలిపారు.ఇక మరునాడు షూటింగ్లో ఒకే టేక్‌లో అంతా ఒకే అయింది.అంతా సూపర్బ్‌గా వచ్చింది.అందరూ క్లాప్స్ కూడా కొట్టారు.అప్పుడే ఆయనే వచ్చి సారీ అమ్మా ఆ రోజు తప్పు చేశానని అని ఆయన అన్నట్టు నటి సుధ గర్వంగా చెప్పారు.