ఇప్పటి రాజకీయ కాలంలో ఎవరూ చేయనటువంటి సాహసానికి జగన్ మోహన్‌రెడ్డి రెడీ అయిపోతున్నారు.అదే మంత్రుల మార్పు.
నిజానికి ఈ సాహసం గతంలో ఎన్టీరామారావు చేసి ఫెయిల్ అయిపోయారు.ఎందుకంటే మంత్రుల మార్పు అనేది మామూలు విషయం కాదు.
ఒక ప్రభుత్వం ఉండేదే అయిదేండ్లు.అందులో రెండున్నరేండ్లకు కేబినెట్ మార్పు అంటే అది చివరకు ప్రభుత్వంపై ఎఫెక్ట్ చూపుతుందని అంతా అంటున్నారు.
నిజానికి ఇప్పుడున్న వారెవ్వరూ కూడా తమ స్వప్రయోజనాల కంటే ప్రజాసేవ ముఖ్యంగా రాజకీయాలు చేయట్లేదన్న విషయం అందరికీ తెలిసిందే.
పోనీ ఇప్పుడున్న మంత్రులకు ఒక్కో శాఖ మీద అవగాహన రావాలంటేనే కనీసం ఆరు నెలలకు పైగానే సమయం పడుతుంది.
ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న వారికి ఆ శాఖ మీద అంతో ఇంతో అవగాహన ఉంటుంది.ఇలాంటి సమయంలో వారిని మార్చేసి కొత్తవారికి అవకాశం ఇస్తే చివరకు ప్రభుత్వం నుంచి ప్రజలకు సేవలు సరిగ్గా అందవని చెబుతున్నారు విశ్లేషకులు.
మంత్రుల మార్పు అనేది వైసీపీ ఎమ్మెల్యేల మెప్పు పరంగా జగన్ కు కలిసి వచ్చే అంశమే అయినా కూడా జనాలకు మాత్రం నష్టమనే చెప్పాలి.
ఇప్పటికే ఎవరు మంత్రిగా ఉన్నా సరే సరిగ్గా పనులు జరగట్లేదనే వాదన ఉంది.ఇలాంటి సమయంలో పనులను స్పీడు చేయాల్సింది పోయి కొత్త వారిని తీసుకొస్తే పూర్తిగా పనులు ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.మొత్తంగా జనాల నుంచి మాత్రం వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.దీన్నే ప్రతిపక్షాలు అవకాశంగా మలుచుకుని జనాలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.ఇలా ఎటు చూసినా కూడా మంత్రుల మార్పు అనేది వైసీపీకి పెద్ద నష్టం అనే చెబుతున్నారు విశ్లేషకులు.చూడాలి మరి జగన్ నిజంగా అంతటి సాహసం చేస్తారా లేదా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది.